అర్నాబ్ ఇదేం పాడు పని..

ముంబై: టీవీ న్యూస్‌ ఛానల్స్‌కు ఇచ్చే టీఆర్పీ రేటింగ్స్‌ స్కామ్‌ను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు.ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ రిపబ్లిక్‌ టీవీ తో పాటు ఫాస్ట్ మరాఠి, బాక్స్ ఛానల్ అనే రెండు స్థానిక న్యూస్ ఛానల్ లు ఈ స్కామ్ కు పాల్పడినట్టు ముంబై పోలీసులు ఆధారాలతో సహా నిర్థారించారు.

 Arnab Summoned In Trp Scam-TeluguStop.com

తమ ఛానల్ లను మార్చకుండా స్థిరంగా వీక్షించేందుకు ఇంటికి 500 రూపాయల చొప్పున డబ్బులు పంచుతున్నారని పోలీసులు నిగ్గు తేల్చారు.

ఈ వ్యవహారంలో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి మినహా మిగిలిన రెండు స్థానిక ఛానెళ్ల యజమానులను అదుపులోకి తీసుకున్నట్టు ముంబై పోలీస్ కమిషనర్ పరంభీర్ సింగ్ తెలిపారు.

 Arnab Summoned In Trp Scam-అర్నాబ్ ఇదేం పాడు పని..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్నాబ్ కు అతి త్వరలో సమన్లు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.దేశంలో ఇతర ప్రాంతాల్లో సైతం ఇలాంటి రేటింగ్స్‌ స్కామ్ లు జరుగుతున్నట్లు తమ వద్ద సమాచారముందని ఆయన అన్నారు.

రేటింగ్స్ ను పర్యవేక్షిస్తున్న హంసా కంపెనీలో కొందరు మాజీ ఉద్యోగులు ఈ స్కామ్ కు పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఈ విషయంపై స్పందించిన రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ ఈ వార్తలను ఖండించాడు.

ముంబై పోలీసులు కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈ కుట్ర వెనుక మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆరోపించారు.సుశాంత్‌ సింగ్ రాజపుత్ కేసులో నిజాలను నిగ్గు తేల్చే క్రమంలో తమ ఛానల్ నిక్కచ్చిగా వ్యవహరించిందని, దాని పర్యవసానమే ఈ కక్ష సాధింపు అని అర్నాబ్‌ మండిపడ్డారు.

#@republic #Arnab Goswami #Trp Rating Scam #Box Channel #Fast Marati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు