హీరోయిన్ సోనాక్షి సిన్హా(S onakshi Sinha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల ఈమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ప్రియుడు జహీర్ ఇక్బాల్ భర్తగా మారడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.పెళ్లి తర్వాత నుంచి వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది సోనాక్షి.
అందులో భాగంగానే తాజాగా ఏముంద ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియో షేర్ చేసింది.ఇందులో సోనాక్షి హీల్స్ ను ఇక్బాల్( zaheer iqbal ) తన చేతులతో పట్టుకుని ముందు నడుస్తున్నాడు.
భార్యపై చిరాకు పడకుండా నవ్వుతూనే చెప్పులు మోశాడు.కరెక్ట్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని హీరోయిన్ రాసుకొచ్చింది.ఇకపోతే సోనాక్షి, ఇక్బాల్ పెళ్లిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.ఇద్దరూ విభిన్న వర్గానికి చెందినవారు కావడంతో ఈ జంటపై నెటిజన్లు విషం చిమ్మారు.కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి అనరాని మాటలు అన్నారు.ఇక ఆ వీడియోపై నెటిజన్స్ స్పందిస్తూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ సంగతి అటు ఉంచితే సోనాక్షి సిన్హా పెళ్లి జరిగిన రెండు రోజులకే ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha )ఆస్పత్రిపాలయిన విషయం తెలిసిందే.
సర్జరీ చేయించుకోబోతున్నాడని రూమర్లు రాగా వాటిని ఆయన కుమారుడు లవ్ సిన్హ కొట్టిపారేశాడు.తీవ్ర జ్వరం కారణంగానే ఆస్పత్రిలో చేరాడని, సర్జరీ వంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.ఈ విషయంపై కూడా చాలామంది ఈ కొత్త జంట పై దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.
కానీ సోనాక్షి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తనకు తన భర్తకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.