వైసీపీ నేతల మొర ఇప్పటికైనా జగన్ ఆలకిస్తారా ? 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) వైసిపికి పెద్ద షాక్ నే ఇచ్చాయి.ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశామని,  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు 99% పూర్తి చేశామని , ప్రజలంతా తమ పాలనలో సంతృప్తిగా ఉన్నారని , మళ్ళీ తమకే అధికారం కట్ట పెడతారని,  175 కు 175 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉంటూ వచ్చిన జగన్ కు ప్రజలు ఊహించని స్థాయిలో తీర్పు ఇచ్చారు.

 Will Jagan Still Listen To The Cry Of Ycp Leaders, Jagan, Ysrcp, Ap Elections, A-TeluguStop.com

కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితం అయింది.దీంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

ఓటమికి గల కారణాలు ఏమిటి అనేది పార్టీ నేతలతో జగన్( Jagan ) సమీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా పార్టీ ఓటమికి గల కారణాలను మొహమాటం లేకుండా వైసిపి నేతలు జగన్ కు వివరిస్తున్నారు.

Telugu Ap, Jagan, Telugudesam, Jagan Cry Ycp, Ys Jagan, Ysrcp-Politics

కొంతమంది మీడియా,  సోషల్ మీడియా ద్వారా ఓటమికి గల కారణాలను వివరిస్తూ , జగన్ మారాల్సిన అవసరాన్ని వారు గుర్తుచేస్తున్నారు.గత వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదట్లోనే ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడాన్ని ప్రజలెవరూ సహించలేకపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Former minister Gudivada Amarnath ) మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.  అప్పుడు కూల్చకుండా ఉండి ఉంటే , ఇంతటి దారుణమైన ఓటమి ఎదురయ్యి ఉండేది కాదని అమర్నాథ్ అభొలిప్రయపడుతుండగా, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి( Former MLA Kasu Mahesh Reddy ) కూడా ఓటమికి గల కారణాలను వివరించారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తమ పార్టీ విజయవకాశాలను దెబ్బతీశాయని సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

Telugu Ap, Jagan, Telugudesam, Jagan Cry Ycp, Ys Jagan, Ysrcp-Politics

నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల మద్యం తాగే వాళ్ళు , దానికి అలవాటు పడిన వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని , దీనిని గుర్తించి మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డికి చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందని,  పేద వర్గాలు మద్యం ఇసుక పాలసీ కారణంగానే పార్టీకి దూరమయ్యారని కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.ఇక వైసిపిలోని కొంతమంది కీలక నాయకులు తరచుగా చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని భూతులతో మీడియా ముందు రెచ్చిపోవడం వంటివన్నీ టిడిపి అభిమానుల్లో జనాల్లో నూ వైసిపి పై వ్యతిరేకతను పెంచేశాయని అభిప్రాయపడుతున్నారు.  ఇంకా జగన్ నిర్ణయాల విషయంలోనూ మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ,  జగన్ తన నిర్ణయాలను మార్చుకోవాల్సిన పరిస్థితిని గురించి వివరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube