బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss )కార్యక్రమానికి ఏ స్థాయిలో ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఇప్పటివరకు ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇకపోతే తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతోంది సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమం ఇదివరకులా కాకుండా సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున ( Nagarjuna )వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.ఈ క్రమంలోనే ఈసారి సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ జాబితాలో వెండితెర ఆర్టిస్ట్ సురేఖ వాణి( Surekha Vani )తన కూతురు సుప్రీత కూడా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.
అలాంటిది వీరిద్దరూ బిగ్ బాస్ వెళ్తే మరో లెవెల్ లో ఈ కార్యక్రమం ఉంటుందని అందరూ భావించారు.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో సురేఖ వాణి తన కూతురు సుప్రీత( Supritha ) కూడా పాల్గొనబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలపై వీళ్లు స్పందించారు.ఈ సందర్భంగా సురేఖ వాణి మాట్లాడుతూ తాము బిగ్ బాస్ లోకి వెళ్తున్నాము అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని అయితే గతంలో కూడా ఇలాంటి వార్తలు చాలా వచ్చాయని తెలిపారు.బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లోకి వెళ్లి తాము నెగెటివిటీ మూట కట్టుకోలేమని అందుకే తాము బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లలేదని తమ గురించి వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా ఆ వాస్తవమని సురేఖ వాణి బిగ్ బాస్ ఎంట్రీ గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.