శృంగారం తరువాత మూత్ర విసర్జన చేయాలా.?

గమనించి ఉంటారు, శృంగారం పూర్తయిన తరువాత కాని, హస్తప్రయోగం చేసుకున్న తరువాత కాని, మూత్ర విసర్జన చేయాలి అనిపిస్తుంది.ఒక్కోసారి మూత్రం దానంతట అదే వస్తుంది.

 Why Should One Urinate After $ex?-TeluguStop.com

స్త్రీలలో అయితే మూత్ర విసర్జన జరగటం ఇంకా ఎక్కువ.మరి $ex తరువాత మూత్ర విసర్జన చేయడం కరెక్టేనా అంటే ముమ్మాటికి కరెక్టే.

* ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమైమ విషయం.శృంగారం సమయంలో జరిగే రాపిడి వలన ఒకరి శరీరంలోంచి మరొకరి శరీరంలోకి కొన్నిరకాల బ్యాక్టీరియా పదార్థాలు వెళ్ళవచ్చు.

మూత్రం వాటిని బయటకి తీసుకువస్తుంది.

* కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు యురెత్రాలోకి వెళితే ఇంఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటప్పుడు మూత్రమే సహాయం చేసేది.


* మహిళలు యూరినరి ట్రాక్ ఇంఫెక్షన్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.శృంగారం తరువాత మూత్ర విసర్జన చేస్తే ఇలాంటి యూటిఐ ఇంఫెక్షన్స్ ని దూరం పెట్టవచ్చు.

* శృంగారం తరువాత మూత్ర విసర్జన చేస్తే మలీనాలు, మైక్రోబ్స్ బ్లాడర్ లోకి, కిడ్నీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.

* మూత్ర విసర్జన మీ ఆరోగ్యాన్ని తెలుపుతుంది.శృంగారం తరువాత కాని, శృంగారం తరువాత కొన్ని గంటల్లో కాని, మూత్రం రంగులో తేడా కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

* శృంగారం తరువాత మూత్ర విసర్జన చేయడం ఒక హైజీనిక్ హ్యాబిట్ గా చెబుతారు సెక్సాలాజిస్టులు.సాధ్యమైనంతవరకు, కనీసం చిన్నిపాటి ఇంఫెక్షన్స్ నుంచైనా మనల్ని కాపాడుతుంది ఈ అలవాటు.

అలాగే కండోమ్ వాడినా సరే, మూత్ర విసర్జన చేయడం మర్చిపోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube