ఉక్రెయిన్ దేశంపై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు రష్యాకి వ్యతిరేకంగా మారాయి.రష్యా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు వివిధ రకాల ఆంక్షలు కూడా విధించాయి.
భారత్‌పై అమెరికాతో( India ) పాటు యూరప్ దేశాలు ఒత్తిడికి తెచ్చాయి.ఆయిల్ కొనుగోలు చేయకూడదని కోరాయి.
జి20 సమావేశాల్లోనూ భారత్ ను బతిమిలాడాయి కానీ మిత్ర దేశమైన రష్యాతో ఇండియా తన వ్యాపార సంబంధాలను తెంచుకోలేదు.బహిరంగంగానే తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించింది.అయితే యూరప్ దేశాలు మాత్రం ఇప్పుడు రహస్యంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని తెలుస్తోంది.
మొదట రష్యాపై( Russia ) అగ్గి మీద గుగ్గిలమైన యూరప్ దేశాలు ఇప్పుడు ఆ దేశం నుంచే పెద్ద ఎత్తున వివిధ రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి.ఫ్రాన్స్ దేశం యూరేనియంను( Uranium ) కొనుగోలు చేస్తూ ఆ దేశంలో మిలియన్ల డాలర్లను కుమ్మరిస్తోంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన సమయం నుంచి యూరప్ దేశాలు రష్యాలో 700 మిలియన్ల డాలర్ల వ్యాపారం చేశాయి.
ఇక రష్యా నుంచి అల్యూమినియం కూడా పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తరలిపోతోంది.కాగా నికెల్, కాపర్, పెలోడియం మీద ఆంక్షలు లేవని, అందుకే వాటిని దిగుమతి చేసుకుంటున్నట్లు సదరు దేశాలు చెబుతున్నట్లు సమాచారం.వీటన్నిటిపై ఆంక్షలు లేనప్పుడు రష్యాని ఆర్థికంగా ఎలా దెబ్బ తీస్తాయో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.మరోవైపు మిగిలిన యూరప్ దేశాలు ఆంక్షలు అంటూ మమ్మల్ని కట్టడి చేసి మీరు బిజినెస్ చేసుకుంటున్నారా అంటూ ఇతర దేశాలపై మండిపడుతున్నాయి.
అమెరికా కూడా ఈ విషయంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.