తల్లి తోకతో చిరుత పిల్ల పరాచకాలు.. తర్వాత తల్లి ఏం చేసిందో చూస్తే..

పిల్లలు, వాటి తల్లి చిరుతపులులు( Leopard ) ఒకదానికొకటి బాగా ఆడుకుంటాయి.తద్వారా వాటి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.

 Leopard Cub Cub Play With Mother's Tail What Mother Did Next , Leopard, Leopa-TeluguStop.com

ఇవి అవసరమైన వేట ప్రవర్తనలను అనుకరిస్తూనే ఒకదానికొకటి ఎంతో ఆనందంగా ఆడుకుంటాయి.ముఖ్యంగా పిల్లలు తల్లులపై ప్రాంక్స్ కూడా చేస్తుంటాయి.

అవి తల్లిపులుల తోకలను లాగుతూ అల్లరి చేస్తుంటాయి.

అయితే నిన్న అంటే బుధవారం నాడు చిరుతపులుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో వీటికి సంబంధించి అనేక వీడియోలు, పోస్టులు షేర్ చేయడం జరిగింది.వాటిలో ఒక వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

దీనిని ఐఏఎస్ అధికారి ఎంవీ రావు ట్విట్టర్‌( Twitter ) వేదికగా పంచుకున్నారు.షేర్ చేసిన కొంత సమయంలోనే ఇది వైరల్‌గా మారింది.ఐఏఎస్ అధికారి ఈ క్యూట్ వీడియోను షేర్ చేస్తూ “అలా కలిసే ఆ అనుబంధం.

ప్రకృతి ఒక అద్భుతం” అని ఒక క్యాప్షన్ జత చేశారు.ఈ వైరల్ వీడియోలో తల్లి చిరుత నేలపై పడుకొని ఉంది.

అప్పుడు పిల్ల చిరుత( Leopard cub ) తల్లి చిరుత తోకతో ఆడుకుంటూ కనిపించింది.అది దాని తోకను కొరుకుతూ దానిమీద పండి బొర్లుతూ తన తల్లితో ఆడుకుంది.

తల్లి కూడా తన పిల్లను దగ్గరికి తీసుకొని ఆడించింది.ఈ దృశ్యం చూసేందుకు అద్భుతంగా అనిపించింది.దీన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మదర్స్ లవ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.17 సెకన్ల నిడివి గల ఈ వీడియోకి ఇప్పటికే ఏడు వేలకు పైన వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube