జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలాగే సినిమాల్లో హీరోగా కూడా చేస్తూ తన సత్తా ఏంటి అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలిసేలా చేశాడు… అయితే ఇండస్ట్రీకి రావడానికి ముందే మ్యాజిక్ లు చెయ్యడం నేర్చుకున్న సుధీర్( Sudigali sudheer ) ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలెబ్రెటీస్ దగ్గర తానూ చేసిన మ్యాజిక్ షోలు ఇప్పటికి యూట్యూబ్ లో ఉన్నాయి… ఇలా మ్యాజిక్ లు చేసుకుంటున్న సుదీర్, గెటప్ శ్రీను ( Getup Srinu ) వల్ల జబర్దస్త్ లో అవకాశం వచ్చింది.
వేణు వండర్స్ టీంలో స్కిట్స్ చేస్తూ, సుదీర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
వేణు వండర్స్ టీంలో కంటెస్టెంట్ గా ఉన్న సుధీర్, చాలా తక్కువ టైంలోనే టీం లీడర్ గా ఎదిగాడు, ఆ టీం పేరే సుడిగాలి సుధీర్.రామ్ ప్రసాద్, గెట్ అప్ శీను, సన్నీ, సుదీర్ సుడిగాలి సుధీర్ టీంగా మారారు.రామ్ ప్రసాద్ స్కిట్స్ రాస్తూ ఉంటాడు.
రామ్ ప్రసాద్ కొత్తగా టైములో రాసిన పంచ్ లకు తెలుగు స్టేట్స్ లలో చాలా గుర్తింపు వచ్చింది.
ఈ ముగ్గురు చేసే కామెడీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉంటారు.సుడిగాలి సుదీర్ టీం పెర్ఫర్మ్ ఈటీవీలో వస్తున్నప్పుడే వ్యూయర్స్ ఎక్కువగా చూసేవారని, ఒక టైములో జబర్దస్త్ ను కేవలం సుడిగాలి సుధీర్ టీం మాత్రమే కాపాడే స్థాయికి చేరుకున్నారు.
అయితే ఒక టైం లో సుధీర్ కి వెన్ను దగ్గర ఒక కురుపు అయింది దాంతో ఆయనకి చాలా ఇబ్బంది అయింది అప్పుడు డాక్టర్లు దాన్ని ఆపరేషన్ చేసి తీసేశారు కానీ ఆ ఆపరేషన్ చేసే టైం లో నారాలకి ఏదైనా అయితే నడుము కింది నుంచి ఆయన బాడీ మొత్తం మొద్దుబారి పోతుంది ఇక చలనం ఉండదు అని చెప్పారు దాంతో అప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డారు సుదీర్.