చైనాలో( China ) హాట్‌పాట్ రెస్టారెంటులో( Hotpot Restaurant ) షాకింగ్ మోసం బయటపడింది.కొంతమంది కస్టమర్లు లిక్విడ్ ఫుడ్ కొంచెం తిని మిగతాది వదిలేస్తారు కదా, అదే నీటిని నూనెలో మళ్లీ కలిపేస్తున్న ఘోరం వెలుగులోకి వచ్చింది.
సిచువాన్‌లోని ఓ రెస్టారెంటు సలైవా ఆయిల్( Saliva Oil ) పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టింది.వినియోగదారులు వదిలేసిన స్పైసీ ఆయిల్ సూప్‌ను సేకరించి, దానిని కొత్త నూనెతో కలిపి మళ్లీ కొత్త కస్టమర్లకు వడ్డించేది.
ఓ కస్టమర్ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, మిగిలిపోయిన నూనెను రీసైకిల్( Recycling Oil ) చేసి, హాట్‌పాట్ సూప్‌లలో వాడుతున్నందుకు అధికారులు రెస్టారెంటును మూసివేశారు.2024 డిసెంబర్ 31న, నాన్‌చోంగ్ మార్కెట్ రెగ్యులేషన్ అడ్మినిస్ట్రేషన్ వారు 11.54 కిలోల రీసైకిల్ చేసిన బీఫ్ టేలోను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.చోంగ్‌కింగ్, సిచువాన్ హాట్‌పాట్‌లో బీఫ్ టేలో ఒక ముఖ్యమైన పదార్థం.తనిఖీల సమయంలో, అధికారులు నాలుగు కుండీల బీఫ్ టేలోను పరిశీలించారు.అవి లైసెన్స్ పొందిన సరఫరాదారుల నుంచి వచ్చిన సాధారణ ప్యాక్ చేసిన వాటిలా లేవని గుర్తించారు.అంతేకాదు, గత కస్టమర్ల ప్లేట్ల నుంచి నూనెను సేకరించి, కొత్త నూనెతో కలిపి మళ్లీ వాడుతున్నారని కనుగొన్నారు.
రెస్టారెంటు యజమాని చెన్ సెప్టెంబర్ నుంచి కారం నూనెను రీసైకిల్ చేస్తున్నట్లు అంగీకరించాడు.సూప్( Soup ) రుచిని మెరుగుపరచడానికి, నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు.అయితే, ఈ చర్య చైనా ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తుంది.ఈ చట్టం ప్రకారం మిగిలిపోయిన ఆహార పదార్థాలను తిరిగి ఉపయోగించడం నేరం.
ఈ వివాదం ఉన్నా, చాలా మంది రెగ్యులర్ కస్టమర్లు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.కొందరు ఆన్‌లైన్‌లో రెస్టారెంటుకు మద్దతుగా నిలిచారు.ఈ విషయం తమకు ముందే తెలుసని, ఆ నూనె వల్ల సూప్ రుచిగా ఉంటుందని వారు వాదించారు.“వాడిన నూనె లేని హాట్‌పాట్ అంత రుచిగా ఉండదు” అని కొందరు తెగేసి చెప్పారు.
2009లో ప్రవేశపెట్టిన చైనా ఆహార భద్రతా చట్టం ఇలాంటి చర్యలను నిషేధిస్తుంది.ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు లేదా చైనా క్రిమినల్ లా ప్రకారం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.