వైరల్ వీడియో: ఒంటి చేత్తో 90 లక్షల విలువైన క్యాచ్ ను పట్టుకున్న వీక్షకుడు

తాజాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్( SA20 ) మొదలైన సంగతి అందరికీ తెలిసింది.ఇందులో భాగంగా ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల స్టార్ ఆటగాళ్లు వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

 Cricket Fan Becomes Millionaire After Catching Kane Williamson Six In Sa20 Leagu-TeluguStop.com

నిజానికి ప్రపంచవ్యాప్తంగా టి20 లీగుల మాదిరిగానే ఇందులో కూడా ఆడే క్రికెటర్లు భారీ ఫీజులు తీసుకొని ఈ టోర్నీలోకి అడుగుపెడుతూ ఉంటారు.అయితే, సాధారణంగా ఏ క్రికెట్ లీగైన సరే మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు మాత్రం మంచిగా సంపాదిస్తూ ఉంటారు.

కానీ, SA20లో మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.ప్రేక్షకులు కూడా బాగా డబ్బును సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఈ క్రమంలో తాజాగా ఒక ప్రేక్షకుడు ఊహించని విధంగా రివార్డ్ సొంతం చేసుకున్నాడు.ఈ అవార్డుకు వెటర్నన్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్( Kane Williamson ) కారణమయ్యాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Telugu Betway, Kane Williamson, Cricket Fan, Cricketfan, Durban, Pritoria, Sa Le

తాజాగా SA20 మూడవ సీజన్ లో భాగంగా టోర్నీలో రెండవ మ్యాచ్ డర్బన్ సూపర్ జెయింట్స్,( Durban Supergiants ) ప్రిటోరియా క్యాపిటల్స్( Pritoria Capitals ) మధ్య జరిగింది.డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆదిత్య జట్టు మొదటగా బ్యాటింగ్ చేయగా.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు కేన్ విలియమ్సన్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు స్కోరును 200 దాటించేసాడు.

అంతేకాకుండా కేన్ విలియమ్సన్ జట్టుకు మంచి స్కోర్ ఇవ్వడమే కాకుండా.మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానికి ఊహించని విధంగా రివార్డును సొంతం చేసి పెట్టాడు.

ఇన్నింగ్స్ లో భాగంగా 7వ ఓవర్ మూడో బంతికి కేన్ విలియమ్సన్ స్లాగ్ స్వీప్ ఆడి గాలిలో భారీ షాట్ ఆడాడు.బంతి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ బయటకు వెళ్ళగా ఇక్కడ అద్భుతం కనిపించింది.

Telugu Betway, Kane Williamson, Cricket Fan, Cricketfan, Durban, Pritoria, Sa Le

ప్రతి స్టేడియం లాగానే ఇక్కడ కూడా సీట్లో కూర్చున్న ప్రేక్షకులు బంతిని పట్టుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేశారు.అచ్చం అలాగే ఈ మ్యాచ్ లో కూడా ఒకరు విజయం సొంతం చేసుకున్నాడు.ఆ వ్యక్తి అద్భుతమైన స్టైల్ లో ఆ బాలును క్యాచ్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి లోను చేశాడు.క్యాచ్ పట్టిన వెంటనే అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

అతని చుట్టూ ఉన్న మిగతా ప్రేక్షకులు కూడా ఆనందంలో చేరి అతనిని అభినందించారు.ఎందుకంటే, ఈ క్యాచ్ అతని కోటీశ్వరుని చేసింది.

వాస్తవానికి అభిమానులు ఆకర్షించేందుకు ఈ స్టేడియంలో క్యాచ్ పట్టుకుంటే 2 మిలియన్ ర్యాండ్స్ అంటే దాదాపు భారత కరెన్సీలో 90 లక్షలు ఇస్తామని ప్రకటించారు.ఈ క్రమంలో ఈ వ్యక్తి 2 మిలియన్ ర్యాండ్ రివార్డ్ సొంతం చే సుకున్న లిస్టులో చేరిపోయాడు.

ఇప్పటివరకు ఈ అవార్డును సొంతం చేసుకున్న వారిలో ఇతను రెండవ వ్యకి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube