ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం పక్షలకు, జంతువులకు, మనుషులు చేసే సాహసాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇందులో ఎక్కువ శాతం పులులు, సింహాలు, మొసళ్లు వేటాడే సమయంలో అవి చేసే సాహసాలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.అచ్చం అలాగే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) ఒక మొసలి( Crocodile ) నీటిలో చేసిన విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి కలుగచేస్తున్నాయి.
మనిషి నీటిలో మునిగిపోయి ప్రాణాలు పోతన్న సమయంలో చేతులు కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఆ మొసలి నీటిలో మునిగింది.అనంతరం తన ముందు కాళ్ళను నీటిపై ఉంచి బోర్లా పడుకుంది.అది ఎలా అంటే, సాధారణంగా మనుషులు( Humans ) నీటిలో మునిగిపోతే ఎలాగైతే చేతులు పైకి ఊపుతారో అచ్చం అలాగే ఆ ముసలి కూడా తన కాళ్లను నీటిపై అటు ఇటు కదిలించడం మొదలు పెట్టింది.
ఇక ఇది చూసిన వారు అందరూ మనుషులు ఎవరైనా నీటిలో మునిగిపోతున్నారేమో అని భావించి నీటిలోకి దిగిపోతే మాత్రం ఆ మొసలి కి ఆహారం అవ్వాల్సిందే.ఇక ఈ వీడియోని చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.వామ్మో.
ఈ మొసలి యాక్టింగ్ మామూలుగా లేదు కదా అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొందరు వివిధ రకాల ఏమోజీలతో వారి అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు.మరికొందరేమో ఈ ముసలికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.