ఈ 4 చిట్కాలను పాటిస్తే మాత్రం టెన్షన్ ఫ్రీ లైఫ్ సొంతమట.. వెంకీమామ ఏం చెప్పారంటే?

సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో ఎక్కువ అంచనాలు నెలకొన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అని కామెంట్లు వినిపిస్తున్నాయి.వెంకటేశ్ కు( Venkatesh ) సరిపోయే సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Hero Venkatesh Comments About Tension Free Life Details, Venkatesh, Hero Venkate-TeluguStop.com

తాజాగా వెంకటేశ్ ది రానా దగ్గుబాటి షోలో( The Rana Daggubati Show ) పాల్గొనడం జరిగింది.

ఈ షోలో టెన్షన్ ఫ్రీ లైఫ్ ను పొందాలంటే పాటించాల్సిన చిట్కాల గురించి ఆయన చెప్పుకొచ్చారు.

నా వరకు నేనెప్పుడూ లైఫ్ లో 4 విషయాలను పాటిస్తానని వెంకటేశ్ అన్నారు.కష్టపడటం.నివేదించటం.బయటకు వచ్చేయడం.

అంగీకరించటం అని ఆయన కామెంట్లు చేశారు.మనం ఏ పని చేసినా కచ్చితంగా కష్టపడాలని వెంకటేశ్ పేర్కొన్నారు.

పని అయిన తర్వాత దాని ఫలితాన్ని ఈ ప్రపంచానికి వదిలేయాలని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.

Telugu Anil Ravipudi, Venkatesh, Ranadaggubati-Movie

ఈ రెండూ ఎంత ముఖ్యమో మరో రెండు కూడా అంతే ముఖ్యమని ఆయన వెల్లడించారు.అవే బయటపడటం ఫలితాన్ని అంగీకరించడం అని వెంకటేశ్ పేర్కొన్నారు.నిత్యం ధ్యాన సాధన చేయడంతో పాటు గురువులు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్ల ఇది నాకు సాధ్యమైందని వెంకటేశ్ వెల్లడించారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీని కష్టపడి పూర్తి చేశానని రిజల్ట్ ఏది వచ్చినా దాన్ని తీసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Anil Ravipudi, Venkatesh, Ranadaggubati-Movie

ప్రస్తుతం జనాలు ఆందోళన పడటానికి కారణం వాళ్ల లైఫ్ లో జరిగే వాటిని అంగీకరించకపోవడమే అని వెంకటేశ్ వెల్లడించారు.సినిమా టైటిల్ కు కథకు సంబంధం ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.భవిష్యత్తులో వెంకటేశ్ గారితో మరిన్ని సినిమాలు చేస్తానేమో అని ఆయన వెల్లడించడం గమనార్హం.

ఈ నెల 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube