హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

అల్లు బాబు బన్నీ నటించిన పుష్ప సినిమా పార్ట్ 2( Pushpa 2 ) విడుదల సందర్భంగా, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి నెలరోజులకు పైనే అవుతున్నప్పటికీ, ఈ కేసుకు గురించి ఏదో ఒక వార్త ఇప్పటికీ మనకి మీడియాలో వినబడుతోంది.ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో( Nampally Court ) హీరో అల్లు అర్జున్ కు( Allu Arjun ) స్వల్ప ఊరట దొరికినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 Nampally Court Big Relief For Allu Arjun Details, Allu Arjun, Latest News, Namp-TeluguStop.com

అవును.ప్రతి ఆదివారం అల్లు అర్జున్ పోలీసు స్టేషన్లో హాజరు కావాలన్న నిబంధనల నుంచి కోర్టు మినహాయించింది.

గతంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని అల్లు అర్జున్ కు షరతులు విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Allu Arjun, Chikkadapalli, Latest, Nampally, Pushpa, Pushpa Rule, Sandhya

ఈ క్రమంలోనే భద్రతా కారణాల దృష్ట్యా తనకి మినహాయింపు ఇవ్వాలని బన్నీ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది.ఈ తరుణంలో అల్లు అర్జున్ వినతిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిబంధనల నుంచి అతనికి మినహాయింపు ఇవ్వడం కొసమెరుపు.అంతేకాకుండా అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు నుంచి అనుమతి లభించడంతో అల్లు కంపౌండ్లో సంక్రాతి సంబరాలు ముందే స్టార్ట్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telugu Allu Arjun, Chikkadapalli, Latest, Nampally, Pushpa, Pushpa Rule, Sandhya

ఇకపోతే… సంధ్య థియేటర్( Sandhya Theatre ) వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 3వ తేదీన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రూ.50 వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని, అదే విధంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ కు హాజరుకావాలని, ఈ కేసు విషయమై సాక్షులను అస్సలు ప్రభావితం చేయొద్దని షరతులు విధించింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్ కు స్వయంగా హాజరై సంతకం కూడా చేసాడు.

అయితే కొన్ని భద్రతా కారణాలతో ఈ షరతుల నుంచి అల్లు అర్జున్న కోర్టును మినహాయింపు కోరారు.ఇందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వడం ఇపుడు సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube