టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్( Director Sukumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుకుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్.ఇకపోతే సుకుమార్ ఇటీవలే అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.
ఇది ఇలా ఉంటే తాజాగా సుకుమార్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.
అదేమిటంటే డైరెక్టర్ సుకుమార్ ఒక హీరోని స్ఫూర్తిగా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారట.ఇంతకీ ఆ హీరో ఎవరు అన్న విషయానికి వస్తే.హీరో, నటుడు రాజశేఖర్ కు ( Rajashekar ) సుకుమార్ వీరాభిమాని.
ఈ విషయాన్ని ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.చిన్న తనంలో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసేవారని తెలిపారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.రాజశేఖర్ కు నేను వీరాభిమానిని.
ఆయన నటించిన ఆహుతి, ఆగ్రహం, అంకుశం, తలంబ్రాలు, మగాడు తదితర చిత్రాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి.చదువుకొనే రోజుల్లో నేను ఆయన్ను ఇమిటేట్ చేస్తుండేవాడిని.
నా పెర్ఫామెన్స్ మెచ్చి అందరూ వన్స్‌మోర్ అనేవారు.అలా నేను ఫేమస్ అయిపోయాను.సినిమాల్లోకి వెళ్లి, ఏదైనా చేయగలననే నమ్మకం కలిగేందుకు అప్పుడు రాజశేఖరే కారణమయ్యారు అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే ఆయన కెరియర్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.పుష్ప 2 సినిమా అయితే ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.గతంలో విడుదలైన పుష్ప 1కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదల ఈ సంచలన విజయాన్ని అందుకుంది.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డుల మోత మోగించి సరికొత్త రికార్డులు సృష్టించింది.