నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) ఈవెంట్ కొన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంగతి తెలిసిందే.శ్రీముఖి( Sreemukhi ) దిల్ రాజు, శిరీష్ లను రామ లక్ష్మణులతో పోలుస్తూ రాముడు లక్ష్మణుడు ఫిక్షన్ అంటూ చేసిన కామెంట్లు వివాదాస్పదం కాగా ఆ కామెంట్ల గురించి శ్రీముఖి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
దిల్ రాజు( Dil Raju ) ఇదే ఈవెంట్ లో ఆంధ్రా ప్రజలు సినిమాలు అంటే వైబ్ ఇస్తారని తెలంగాణ ప్రజలు మటన్, తెల్ల కల్లు అంటే వైబ్ ఇస్తారని అన్నారు.
అయితే ఈ కామెంట్ల విషయంలో విమర్శలు చెలరేగడంతో పాటు గేమ్ ఛేంజర్( Game Changer ) అనుకూల ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో దిల్ రాజు క్షమాపణలు చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణంలో( Nizamabad ) సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశామని మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవని అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ పెట్టామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడానని దిల్ రాజు అన్నారు.
ఆ మాటల్లో తెలంగాణ( Telangana ) వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొందరు మిత్రులు కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసిందని ఆయన వెల్లడించారు.తెలంగాణ దావత్ నేను మిస్ అవుతున్నానని సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉందని దిల్ రాజు తెలిపారు.నా మాటల వల్ల మనస్తాపం చెందితే క్షమించాలని నిజంగా నా ఉద్దేశం అది కాదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ వాసినైన నేను రాష్ట్ర సంస్కృతిని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో తెలియదని నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించాలని ఆయన తెలిపారు.ఎఫ్.డీ.సీకి రాజకీయాలతో సంబంధం లేదని అనవసర విషయాల్లోకి నన్ను లాగవద్దని తెలంగాణలోని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని దిల్ రాజు వెల్లడించారు.