పెద్దాయన్ని నిలువు దోపిడీ చేసిన కేటుగాడు దొరికాడు.. సీఐ ఎంటర్ కావడంతో!

ఆరోజుల్లో దొంగలు దారి కాచి మరీ బాటసారుల దగ్గర దారి దోపిడీ చేసేవాళ్లు.ఆ తరువాత కాలంలో ఇళ్లల్లో పడి దోచుకొనేవారు.

 Anantapur Police Officer Gives Big Twist To Cyber Criminal Digital Arrest Scam O-TeluguStop.com

ఆ తరువాత డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఏటీఎంలు, యూపీఐలతో మోసం చేయడం మొదలు పెట్టారు.ఇలా దొంగలు కూడా కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ దొంగతనం చేయడంలో ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.

అవును, నేటి దొంగలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు.వారు డబ్బుకోసం ఒకప్పటిలాగా పీకమీద కత్తిపెట్టరు, ఆయుధాలతో బెదిరించరు.ఇక మీ ఇంటికి రారు.నగానట్రా అస్సలే దోచుకెళ్లరు.జస్ట్.ముచ్చెమటలు పట్టించి కోట్లు కొట్టేస్తారు సుమీ! ఎందుకంటే వారికి ఇపుడు టెక్నాలజీ అనే వెసులుబాటు కలదు.

ఉన్న చోటనుండే మీ అకౌంట్లలోని డబ్బులు వాళ్ళ అకౌంటుకి ట్రాన్స్ఫర్ అయినపుడు వారెందుకు రిస్క్ తీసుకుంటారు.

Telugu Anantapur, Ci Srikanth, Cyber Criminal, Scam, Dr Yana Reddy, Retiredgove-

ఈమధ్య కాలంలో డిజిటల్‌ అరెస్ట్‌( Digital Arrest ) క్రైమ్ బాగా పాపులర్ అయింది.మొన్న ఆ మధ్య ఓ సైబర్ నేరగాడు( Cyber Criminal ) డిజిటల్ అరెస్టు పేరుతో ఏకంగా పోలీస్‌కే వీడియో కాల్ చేసి అడ్డంగా బుక్ అయిన వీడియో కలకలం రెజినా సంగతి తెలిసిందే.సరిగ్గా అలాంటిదే మరో సంఘటన అనంతపురం( Anantapuram ) జిల్లాలో చోటుచేసుకుంది.

డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సైబర్ నేరగాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి( Retired Govt Employee ) వీడియో కాల్ చేసి 30 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసాడు.అనుమానం వచ్చిన ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు.

కట్ చేస్తే… నెక్స్ట్ టైం వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడికి.వీడియో కాల్‌లో పోలీస్ కనిపించాడు.ఇంకేముంది కట్ చేస్తే… సైబర్ నేరగాడికి నోట మాట రాలేదంటే నమ్మండి!

Telugu Anantapur, Ci Srikanth, Cyber Criminal, Scam, Dr Yana Reddy, Retiredgove-

వివరాల్లోకి వెళితే… అనంతపురంకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నారాయణరెడ్డిని( Dr Narayana Reddy ) సైబర్ నేరగాడు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేసి బెదిరించాడు.రిటైర్డ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నారాయణరెడ్డి ఆధార్ కార్డు బెంగళూరులో మిస్ యూజ్ అయిందని, ఆ నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని సైబర్ నేరగాడు బెదిరిస్తుండడంతో….సైబర్ నేరాలపై కొద్దిగా అవగాహన ఉన్న వృద్ధుడు నారాయణరెడ్డి వెంటనే పోలీసులను ఆశ్రయించడం జరిగింది.ఆ తరువాత టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సైబర్ నేరగాడి బెదిరింపులను పోలీసులకు చెప్పాడు.

సరిగ్గా పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలోనే సైబర్ నేరగాడు మరోమారు రిటైర్డ్ ఉద్యోగి నారాయణరెడ్డికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా… ఫోన్ తీసుకొని టూ టౌన్ సీఐ శ్రీకాంత్ సైబర్ నేరగాడి ముందు ప్రత్యక్షమయ్యాడు.దీంతో ఖంగుతున్న సైబర్ నేరగాడు వెంటనే ఫోన్ కట్ చేసి.

మొబైల్ స్విచ్ ఆఫ్ చేసాడు.ఈ నేపథ్యంలో సైబర్ నేరగాడి వలలో పడకుండా ధైర్యంగా ఎదుర్కొన్న రిటైర్డ్ ఉద్యోగి నారాయణరెడ్డిని పోలీసులు అభినందించి సన్మానం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube