విశాల్ ఆరోగ్యం గురించి రియాక్ట్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్( Varalaxmi Sarath Kumar ) విశాల్( Vishal ) ఆరోగ్యం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.విశాల్ ఆరోగ్యం( Vishal Health ) గురించి వస్తున్న వార్తలను చూశానని వరలక్ష్మి తెలిపారు.

 Varalaxmi Sharat Kumar Comments About Vishal Health Details, Vishal, Varalaxmi S-TeluguStop.com

విశాల్ వైరల్ ఫీవర్( Viral Fever ) వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.విశాల్ త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యంతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నానని వరలక్ష్మి పేర్కొన్నారు.

ఆ తర్వాత వరలక్ష్మి మ్యారీడ్ లైఫ్ గురించి మాట్లాడారు.పెళ్లి తర్వాత లైఫ్ బాగుందని నికోలయ్ సచ్ దేవ్ ఎంతో మంచి వ్యక్తి అని ఆమె చెప్పుకొచ్చారు.

అలాంటి వ్యక్తిని భర్తగా పొందినందుకు సంతోషంగా ఉన్నానని వరలక్ష్మి వెల్లడించారు.నా భర్త ఫ్యామిలీ లైఫ్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ఆమె తెలిపారు.కుటుంబ సభ్యులతో నాకంటే ఎక్కువగా తనే కాంటాక్ట్ లో ఉంటాడని వరలక్ష్మి పేర్కొన్నారు.

Telugu Vishal, Kollywood, Madha Gaja Raja, Varalaxmisarath, Varalxamisarath-Movi

మా అమ్మ వాళ్లు కూడా అన్ని విషయాలను నాకంటే ముందు తనకే చెబుతారని ఆమె అన్నారు.సుందర్ సి డైరెక్షన్ లో తెరకెక్కిన మదగజరాజ మూవీ( Madha Gaja Raja Movie ) ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.విశాల్ అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Vishal, Kollywood, Madha Gaja Raja, Varalaxmisarath, Varalxamisarath-Movi

వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.రాబోయే రోజుల్లో తెలుగులో ఈ నటి మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.వరలక్ష్మీ శరత్ కుమార్ కొత్త సినిమాల ప్రకటన కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube