సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న సినిమాలలో ఎక్కువమంది ప్రేక్షకులు డాకు మహారాజ్( Daaku Maharaaj ) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా రేపు ఉదయం 7 గంటల 45 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలు ప్రదర్శితం కానున్నాయి.హైకోర్టు కామెంట్ల వల్ల ఈ సినిమాకు బెనిఫిట్ షోలు రద్దయ్యాయి.
అయితే చిరంజీవి,( Chiranjeevi ) బాలయ్య( Balayya ) ఇద్దరితో పని చేసిన బాబీ( Bobby ) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ ఇద్దరు హీరోలలో ఎంతో క్రమశిక్షణ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇద్దరు హీరోలు పని రాక్షసులే అని ఆయన వెల్లడించారు.ఈ ఇద్దరు హీరోలు సినిమా కోసం ఎంతైనా కష్టపడతారని బాబీ వెల్లడించారు.
నిర్మాతలకు అసలు నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఈ హీరోలు పని చేస్తారని ఆయన తెలిపారు.
వరుసగా సీనియర్ హీరోలతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం అని బాబీ పేర్కొన్నారు.బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించామని బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్స్ చెబితే బాగుంటుందని బాబీ వెల్లడించారు.డాకూ మహారాజ్ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలో బాబీ డియోల్( Bobby Deol ) గారి రోల్ కొత్తగా ఉంటుందని బాబీ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయని బాబీ కామెంట్లు చేశారు.బాలయ్య నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చని డైరెక్టర్ కు ఎంతో గౌరవం ఇస్తారని బాబీ వెల్లడించారు.బాలయ్య సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారని బాబీ పేర్కొన్నారు.
మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలయ్య గారు అంత గౌరవిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్య డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారని బాబీ వెల్లడించారు.