అఖండ 2 తర్వాత నేనేంటో అందరికీ చూపిస్తా.... నన్ను చూసి నాకే పొగరు: బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ డాకు మహారాజ్( Daaku Maharaaj ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.డైరెక్టర్ బాబి దర్శకత్వంలో నాగ వంశీ నిర్మాణంలో బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

 Balakrishna Interesting Comments On His Future Movies Details, Balakrishna, Daak-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Telugu Akhanda, Balakrishna, Daaku Maharaaj, Daakumaharaaj, Bobby, Tollywood-Mov

నిజానికి ఈ సినిమా వేడుకను అనంతపురంలో ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించారు కానీ తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరు మంది మరణించడంతో అనంతపురంలో ఈ వేడుకను రద్దు చేసుకున్నారు.కేవలం మీడియా సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తాను అఖండ( Akhanda ) సినిమా నుంచి నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయని తెలిపారు.

Telugu Akhanda, Balakrishna, Daaku Maharaaj, Daakumaharaaj, Bobby, Tollywood-Mov

ఇకపై తానేంటో చూస్తారని వెల్లడించారు.ఈ సినిమా అఖండ 2( Akhanda 2 ) తర్వాత అసలు బాలయ్య ఏంటో చూస్తారని తెలిపారు.ఈ సినిమా తర్వాత నేను చేయబోయే సినిమాలు తన ప్రస్తానం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది.ఇక నా రెండో ఇన్సింగ్స్ చూస్తారు.జనరల్‌గా రెండో ఇన్సింగ్స్ అంటే కెరీర్‌ డౌన్‌లో ఉంటే, స్టార్‌ డమ్ తగ్గినప్పుడో రెండో ఇన్నింగ్స్ అంటారు కానీ నాకు మాత్రం ముందు ముందు నేనేంటో చూపించడమే తన సెకండ్ ఇన్నింగ్స్ అని తెలిపారు.ఇంతకు ముందు నన్ను చూస్తే ఏం చూసి ఇతకి ఇంత అహాంకారం అనుకుంటారని, కానీ నన్ను చూసి నాకే పదునైన పొగరు అని.ఈ విషయంలో నాన్నగారే నాకు స్ఫూర్తి అని తెలిపారు.అలాగే ప్రేక్షక దేవుళ్లు, వాళ్లిస్తున్న ప్రోత్సాహం.

మంచి సినిమాలు ఇవ్వాలని తాను ఎప్పుడు ఆరాటపడుతుంటానని తనని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు రుణపడి ఉంటాను అంటూ బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube