టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించారు.
అయితే తాజాగా అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్( Allu Aravind ) 76వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహించారు.అయితే తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప థీమ్ తో ఉన్న కేక్ కట్ చేయించారు.
అయితే ఈ కేక్ మరో ప్రొడ్యూసర్ బన్నీ వాసు తెప్పించారని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇలా అల్లు అర్జున్ తన తండ్రి పుట్టిన రోజు( Allu Aravind Birthday ) వేడుకలను తన కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి అల్లు అరవింద్ చేత కేక కట్ చేయించారు అంతేకాకుండా ఈ పుష్ప థీమ్ తో తయారు చేయించిన కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.పుష్ప థీమ్ కేకుపై పుష్ప కా బాప్( Pushpa Ka Baap ) అని రాసి ఉండటంతో మూవీలో అతని బ్రాండ్ అయిన చేతి గుర్తును కూడా ఈ కేకుపై మనం చూడొచ్చు.
ప్రస్తుతం ఈ కేక్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అల్లు అరవింద్ పుట్టినరోజు నాడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) కూడా విడుదల అయింది అయితే ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది .దీంతో రామ్ చరణ్ కు కౌంటర్ ఇస్తున్నట్టుగా అల్లు అర్జున్ పుష్ప కా బాప్ అని ఉన్నటువంటి కేక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చరణ్ కి కౌంటర్ ఇచ్చారా అంటూ మరికొందరు ఈ పోస్టుపై విమర్శలు కురిపిస్తున్నారు.మరికొందరు మాత్రం ఆ కేకే ఈ ఏడాది హైలైట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.