ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి ఏర్పాటు.. గాంధీలోనే ప్రాణ వాయువు.. !

ప్రస్తుతం ఆక్సిజన్ అందక కరోనా సోకిన వారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికి తెలిసిందే.ఒకగానొక సమయంలో పరిస్దితి విషమించడంతో కనీసం ఆక్సిజన్ అందిస్తే అయిన బ్రతికే అవకాశం ఉన్నా కూడా సమయానికి ఇది దొరకక ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు.

 Gandhi Hospital Set Up A Plant On The Hospital Premises For Oxygen Gandhi Hospit-TeluguStop.com

ప్రస్తుత సమయంలో ఆక్సిజన్ అనేది పెద్ద సమస్యగా పరిగణించింది.అయితే ఈ కొరతను అధికమించడానికి అధికారులు చర్యలు చేపట్టారట.

ఈ క్రమంలో కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆక్సిజన్‌ కోసం వెయ్యికండ్లతో ఎదురుచూసే వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించే వార్త చెబుతుంది.కరోనా బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు ఇచ్చేందుకు అతిపెద్ద ధర్మాస్పత్రి గాంధీలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, ట్రయల్ విజయవంతం కావడంతో శుక్రవారం నుండే ఉత్పత్తి ప్రారంభమై అందుబాటులోకి వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ రాజారావు తెలియచేస్తున్నారు.

కాగా ఇక్కడ నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని, దీంతో ఆక్సిజన్‌ కొరత శాశ్వతంగా తొలగిపోవడమే కాదు ఆక్సిజన్ అందక మరణించే వారు ఇక ఉండరని వివరించారు.ఇకపోతే కోవిడ్ కారణంగా చివరి శ్వాసకై పోరాడే వారికి ఈ వార్త శుభవార్తగా మారనుంది.

మరి ఇకనైన అక్సిజన్ అందక మరణించే మరణాల సంఖ్య తగ్గుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube