సాధారణంగా మన ఇండియాలో రైల్వే ట్రాకుల పైకి కుక్కలు, ఆవులు, బర్రెలు వస్తుంటాయి.దీనివల్ల జంతువుల ప్రాణాలు పోతుంటాయి.
ఒక్కోసారి ట్రైన్స్ కూడా తిరగబడుతుంటాయి.అయితే ఈ సమస్య ఇండియాకి మాత్రమే పరిమితం కాలేదు బాగా డెవలప్ అయిన అమెరికాలో కూడా బర్రెలు, ఎద్దులు, ఆవులు రైల్వే ట్రాక్‌ల మీదకి వస్తుంటాయి.
తాజాగా న్యూ జెర్సీ రాష్ట్రం( New Jersey ), నెవార్క్ నగరంలోని ఎన్‌జె ట్రాన్సిట్ రైలు సర్వీస్ ట్రాక్‌లపై గురువారం ఉదయం ఒక ఎద్దు ప్రత్యక్షమైంది .
ఈ ఎద్దు ఉదయం 10:45 గంటలకు విక్టోరియా స్ట్రీట్(Victoria Street )కు సమీపంలో ఉన్న ఫ్రెలింగ్‌హ్యూసెన్ అవెన్యూలోని ఒక హౌస్ నుంచి తప్పించుకుని, ట్రాక్‌ల వెంట ఒక మైలు దూరం పరుగెత్తింది.ఆ హౌస్‌లో ఆవులు ఎద్దుల తలలు కోసి, చంపేసి, మాంసం ముక్కలు ముక్కలుగా కట్ చేసి విక్రయిస్తారు.అదృష్టం కొద్దీ ఈ ఎద్దు అక్కడి నుంచి తప్పించుకోగలిగింది.
కానీ మళ్ళీ అది రైల్వే ట్రాక్ల పైకి వచ్చే ప్రమాదంలో పడింది.దీని శ్రేయస్సు మేరకు నెవార్క్ పెన్ స్టేషన్, న్యూయార్క్ పెన్ స్టేషన్ల మధ్య రైలు సేవలను దాదాపు 45 నిమిషాల పాటు క్యాన్సిల్ చేశారు.
ఎట్టకేలకు దానిని జంతు నియంత్రణ అధికారులు పట్టుకుని సురక్షితమైన ఎన్‌క్లోజర్‌కు తరలించారు.ఈశాన్య కారిడార్, నార్త్ జెర్సీ కోస్ట్ లైన్ రైళ్లను అధికారులు పట్టాల నుంచి తొలగించడానికి నిలిపివేశారు.సుమారు 11:30 గంటలకు సేవ పునఃప్రారంభమైంది, అయితే రోజంతా కొన్ని ఆలస్యాలు కొనసాగాయి.రక్షకులు ఈ ఎద్దును వధ నుంచి తప్పించి న్యూజెర్సీలోని ఒక వ్యవసాయ అభయారణ్యంకి పంపించారు.
ఇప్పుడు అది అక్కడే ఏ హాని లేకుండా హాయిగా బతికేస్తుంది.ఇక ఎద్దు పారిపోవడాన్ని చాలా మంది గమనించారు, అది ట్రాక్‌లపై నడుస్తున్న వీడియోలను రికార్డ్ చేశారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి, నెటిజన్లు ఎద్దు పట్ల సానుభూతి చూపించారు.