వైరల్: జుట్టును సరిగా కటింగ్ చేయలేదని ఏకంగా ఆ బుడ్డోడు..?!

సాధారణంగా చిన్న పిల్లలు ఎవరిరైనా సరే వారు చేసే పనులు, అల్లరి అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.అయితే, ఒక్కొక్కసారి వారు చేసే పనులు నవ్వును తెప్పిస్తూ ఉంటే.

 Viral A Ten Years Chinese Boy Complaint Police On Barber For Not Doing Perfect H-TeluguStop.com

మరోసారి ఆ పిల్లలు చేసే పనులకు అందరూ ఆశ్యరపోతారు.అయితే తాజాగా ఒక 10 ఏళ్ల బాలుడు చేసిన పని అందర్నీ తెగ ఆకట్టుకుంటుంది.

ఇంతకీ ఏం చేశాడని అనుకుంటున్నారా.? చైనాకు చెందిన పదేళ్ల పిల్లవాడు తన హెయిర్ కట్ బాగా చేయలేదని ఏకంగా పోలీసులను సంప్రదించాడు.తనకు చేసిన హెయిర్ కటింగ్ బాగా లేదని, అసంతృప్తికరంగా ఉన్నాను అంటూ గట్టిగా ఏడుస్తూ ఆ పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

నార్త్ చైనాలోని గుయిజౌలో ఒక 10 ఏళ్ల బాలుడు తన జుట్టు సరిగ్గా కటింగ్ చేయలేదంటూ బార్బర్ పై తీవ్ర కోపంతో పెద్ద కేకలు వేస్తూ, జుట్టుపై చేతులు కదిలిస్తూ చూపిస్తు మరి బార్బర్ షాప్ వద్దకు వచ్చి.పోలీసులను పిలిచి మరి కంప్లైంట్ చేశాడు.

అప్పటికి పోలీసులు ఏం చేయలేకపోవడంతో ఆ చిన్న పిల్లవాడు మరింత ఏడవడం మొదలుపెట్టాడు.ఇక దీనితో పోలీసులు ఏమి చేయలేక, వెంటనే బాలుడు అక్కను అక్కడికి పిలిపించి బాలునికి సర్దిచెప్పిలాని కోరగా, ఆ బాలిక బాలుడికి పోలీసులు చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని తెలిపింది.

తన సోదరుడు ఎప్పుడూ కూడా కేశాలంకరణ గురించి చాలా ప్రత్యేకంగా చెబుతాడని, అందుకే తనకు సరిగ్గా కటింగ్ చేయకపోవడంతో చాలా బాధ పడుతున్నాడని ఆ బాలుడి అక్క తెలిపింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ బాలుడు చేసిన పనికి నవ్వుకుంటూ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube