తెలుగులో తక్కువ సినిమాలే తెరకెక్కించినా ఆ సినిమాలతో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్న నిర్మాతలలో నిర్మాత ఎస్కేఎన్( Producer SKN ) ఒకరు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది నిర్మాతలు సేవా కార్యక్రమాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపరు.
ప్రజలకు కష్టం వస్తే హీరోలు, దర్శకులు స్పందించిన స్థాయిలో నిర్మాతలు( Producers ) ఎప్పుడూ స్పందించలేదనే సంగతి తెలిసిందే.
అయితే నిర్మాత ఎస్కేఎన్ మాత్రం ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను ఆదుకునే విషయంలో ముందువరసలో ఉంటారు.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు( Parvatipuram Manyam District ) చెందిన ఒక వ్యక్తి తన కూతురి పెళ్లి( Daughter Marriage ) కోసం 2 లక్షల రూపాయలను దాచుకోగా ఆ డబ్బు మొత్తం చెదలు పట్టినట్టుగా కావడంతో పాటు వినియోగించుకోవడానికి అనుకూలంగా లేదు.ఒక ట్విట్టర్ పేజ్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొనిరావడంతో ఆ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందితో పోల్చి చూస్తే ఎస్కేఎన్ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కష్టాల్లో ఉన్నవాళ్లకు ఇతరులు తమ వంతు సహాయం చేసి అండగా నిలబడితే ఆ కుటుంబాల సమస్యలు కొంతవరకు అయినా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.ఎస్కేఎన్( SKN ) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా హిట్లుగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎస్కేఎన్ రాబోయే రోజుల్లో బేబీ 2 సినిమాను( Baby 2 ) కూడా నిర్మించే ఛాన్స్ ఉందని సమాచారం.ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకుంటే ఎస్కేఎన్ కు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలను నిర్మిస్తారో చూడాల్సి ఉంది.
ఒకేసారి నాలుగు సినిమాలను నిర్మించే దిశగా ఎస్కేఎన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.ఎస్కేఎన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.