ఈ ప్రపంచంలో ధనవంతుల కంటే పేదవాళ్లు ఎక్కువగా ఉన్నారు.ఈ నిరుపేదలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక బాధపడుతుంటారు ఇక ఈ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు చిన్నతనం నుంచి ఏ పనులు చేయాల్సి వస్తుంది.
కొందరు ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి చిరుప్రాయంలోనే చదువును మానేసి పనులకు వెళుతుంటారు కొందరు మాత్రం చదువుకుంటూ నేను పనులు చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంటారు ఇలాంటివారిని చూస్తే స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.తాజాగా ఇంకొక చెందిన ఒక కుర్రాడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీలో( Delhi ) రద్దీగా ఉన్న ఓ వీధిలో ఒకవైపు కష్టపడుతూనే మరోవైపు చదువుకుంటున్నాను ఈ పిల్లాడు కనిపించాడు.ఈ దృశ్యం చాలా మందికి ఒకేసారి సంతోషాన్ని, బాధను కలిగించింది.ఈ వీడియోను హ్యారీ అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.అతను చుట్టూ ఉన్న సందడిని పట్టించుకోకుండా చదువుకోవడం చూసి ఫిదా అయిపోయాడు.ఈ పిల్లవాడి పేరు పవన్( Pawan ) అని తెలిసింది.పవన్ ఆరో తరగతి చదువుతున్నాడు.
అతను తన కుటుంబానికి సహాయం చేయడానికి కమలా నగర్ మార్కెట్( Kamala Nagar Market ) సమీపంలోని వీధిలో హెయిర్‌బ్యాండ్‌లను విక్రయిస్తున్నాడు.తన తండ్రి కోల్‌కతాలో ఉన్నారని, తన తల్లి ఇంట్లో ఉందని హ్యారీకి చెప్పాడు.
పవన్ జీవితం చాలా కష్టతరమైనప్పటికీ, తన చదువు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు.
పవన్ స్టోరీ గురించి తెలుసుకుని హ్యారీ ఎమోషనల్ అయిపోయాడు.అతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.పోస్ట్ బాగా పాపులర్ అయి కోటికి పైగా వ్యూస్ పొందింది.
ఆ పోస్ట్ చూసిన చాలా మంది పవన్ కు సాయం చేయాలని కోరుతున్నారు.పిల్లోడి ధైర్యాన్ని, కృషిని కొనియాడారు.
మెసేజ్‌లు, కామెంట్‌లన్నింటికీ తాను రిప్లై ఇవ్వలేనని హ్యారీ వ్యాఖ్యల్లో పేర్కొన్నాడు.ఢిల్లీలోని నార్త్ క్యాంపస్‌లోని కమ్లా నగర్ మార్కెట్‌లోని మెక్‌డొనాల్డ్స్ వెలుపల పవన్ కనిపిస్తాడని వెల్లడించారు.
అలాగే పేద పిల్లల కోసం తాను డబ్బులు సేకరిస్తున్నానని, ప్రజలు తనను సంప్రదించి విరాళాలు అందించవచ్చని తెలిపాడు.పవన్‌ని కలిశామని, పిల్లోడి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చినట్లు ఓ వ్యక్తి చెప్పారు.
కానీ పవన్ నో చెప్పడంతో పాటు హెయిర్‌బ్యాండ్ కొనమని కోరాడట.దీంతో ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకున్నాడట.
పవన్ చదువుపై చూపుతున్న ఏకాగ్రత తమను ఎంతగానో ఆకట్టుకుందని మరో వ్యక్తి తెలిపాడు.