ఎన్ని కోట్లు కావాలో చెప్పు సింగిల్ పేమెంట్ లో క్లోజ్ చేద్దాం.కానీ మాకోసం ఒక మంచి కమర్షియల్ సినిమా చేసి పెట్టు అంటూ కాంతారా సినిమా దర్శకుడు అయిన రిషబ్ శెట్టి దగ్గరికి చాలా మంది నిర్మాతలు వచ్చేవారు.
ఎందుకంటే కన్నడలో కూడా ఎంతో మంది అల్లు అరవింద్ లు, దిల్ రాజు, సురేష్ బాబులు వంటి డబ్బున్న పెద్ద మనుషులు చాలా మందే ఉన్నారు.టాలెంట్ ఉన్న వాడిని తమ పక్కనే పెట్టుకొని ఎంతో కొంత పడేసి మంచి కమర్షియల్ సినిమాలు చేయించి వందల కోట్లు వెనకేస్తు ఉంటారు.
కానీ అలా చేస్తే అతడి రిషబ్ శెట్టి ఎందుకు అవుతాడు.
అతడికి కిరిక్ పార్టీ సినిమా బాగానే తీశాడు.
దాంతో కాంతారా సినిమాకు శ్రీకారం చుట్టాడు.కానీ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటే నిర్మాతలు ఎవరు ముందుకు రారు.
ఎవరు ఎన్ని చెప్పినా రిషబ్ వినదు.ఇది నా డ్రీమ్.
మరో సినిమా చేస్తాను నీ కోసమా ఇదొక్కటే నన్ను చేసుకొనివ్వండి అంటూ అందుకే అందరికీ దండం పెట్టి మరి నా ఈ చిన్న సినిమాను తీసుకోనివ్వండి అని పంపించేసాడు.ఇక హోంబలే సినిమా వాళ్ళు మాత్రం ఒక 15 కోట్లు బడ్జెట్ ఇచ్చారు.
ఒకవేళ ఇవ్వకపోయినా క్రౌడ్ ఫండింగ్ తో సినిమా తీయడం అతడికి కొత్తేమి కాదు.

కానీ ఇచ్చిన 15 క్లైమాక్స్ షూట్ కి ముందే అయిపోయాయి.ఇంకో పది కోట్లు ఇమ్మన్న కూడా నిర్మాతలు పెడతారు.కానీ ఫెయిల్యూర్ ప్లానింగ్ అంటారేమో అని భయం.అందుకే మళ్ళీ బడ్జెట్ అడక్కుండా ఇచ్చిన దాంతో సరిపోట్టుకోవలని నిర్ణయించుకున్నాడు.కానీ చివరి వారం రోజులు కేవలం కొబ్బరి నెళ్లతోనే అన్ని పుటలు భోజనం పూర్తి చేసుకున్నాడు.
అప్పటికే విపరీతమైన యాక్షన్ సీన్స్ వల్ల పూర్తిగా గాయాల పాలయిన దేహం.ఇక ఒక్క సీన్ చేసే ఓపిక కూడా లేదు.దర్శకుడు, కథకుడు, హీరో అన్ని తానే.శక్తి లేదు… అప్పుడు వచ్చాడు రాజ్ బి శెట్టి.
క్లైమాక్స్ మొత్తం సీన్స్ అతడే దర్శకత్వం చేసాాడు.అలా మొత్తానికి సినిమాకు శుభం కార్డ్ పడింది.
ఇప్పటికే మూడు వందల కోట్ల కలెక్షన్స్ దాటిపోయాయ్.మరి ఇంత చేసిన రిషబ్ కి ఎంత ముట్టింది అంటే అది రహస్యం అంటున్నాడు.