దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది.బాణసంచా లేకుండా సంబురాలు నిర్వహించుకోవాలని సూచించింది.
ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా , కాల్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని ఉత్తర్వులు వెల్లడించింది.జరిమానా రూ.200 తో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.







