కొద్దిగా అల్లం టీ చేసుకుని తాగితే తలనొప్పి, గొంతు గరగర లాంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.అల్లం బెల్లం లాగా తియ్యగా ఉండకపోయినా దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.అల్లంతో అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
అల్లం ఉపయోగించడం వల్ల ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి.
అల్లం ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే అల్లం ప్రతి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తే దీనివల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.మానవ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ రాకుండా అల్లం ఎప్పుడూ మన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుతుంది.వర్కవుట్స్ చేయడం వల్ల కలిగే కండరాల నొప్పలకు అల్లం ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

వికారంతో బాధపడుతున్నవారు టీలో కాస్త అల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.అల్లం బాడీలో కొలస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు తగ్గిస్తూనే ఉంటుంది.దానివల్ల మనిషి శరీరారోగ్యం ఎంతో ఫిట్ గా ఉంటుంది.కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు అల్లాన్ని ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.
లైంగిక సామర్థ్యం మెరుగు పడటానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.అల్లం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
వివిధ రకాల వ్యాధుల నుండి శరీరాన్ని అల్లం కాపాడుతుంది.నోటి దుర్వాసన, దంత సమస్యలతో బాధపడుతున్న వారికి అల్లం చాలా సహాయపడుతుంది.
కడుపులో ఉండే మంటను అల్లం తగ్గిస్తుంది.ఇలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి అల్లం మన శరీరాన్ని దూరంగా ఉంచుతుంది.