బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో మొదటిగా తీసుకొనే ఆహారం.ఇది మన శరీరానికి,నీరు వలే చాలా ముఖ్యమైనది.
అంతేకాక బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా గ్యాప్,తర్వాత తీసుకొనే ఆహారం.మనం ఉదయం నిద్ర లేచిన రెండు గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ మానకుండా ఉండటానికి 5 ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.
#1.కేలరీలను తగ్గిస్తుంది:
బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో తీసుకొనే మొదటి ఆహారం.బ్రేక్ ఫాస్ట్ కేలరీలను కరిగించటానికి సహాయపడుతుంది.
అది ఎలా అంటే రాత్రి నిద్ర తర్వాత ఉదయం మేల్కొనటానికి మధ్య చాలా సమయం ఉండుట వలన ఉదయం లేవగానే మన శరీరం కొంత శక్తిని డిమాండ్ చేస్తుంది.ఆ సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది.
#2.ఒక ఇంధనం వలే పనిచేస్తుంది:
మన శరీరానికి బ్రేక్ ఫాస్ట్ అనేది ఒక ఇంధనం వలే పనిచేస్తుంది.బ్రేక్ ఫాస్ట్ నుండి పొందిన కేలరీలు మెదడు పనిచేయటానికి సహాయపడతాయి.మనం బ్రేక్ ఫాస్ట్ మానివేస్తే ఆ రోజు వ్యవహారం అంతా తలనొప్పిగా ఉంటుందని గుర్తుంచుకోండి.
#3.మెదడు చురుగ్గా ఉంటుంది:
ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినే పిల్లలు, బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లల కంటే ఎక్కువ చురుకుగా ఉంటారు.మనం తీసుకొనే ఈ బ్రేక్ ఫాస్ట్ మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది.అంతేకాక బలంగా మరియు చురుకుగా ఉండేలా చేస్తుంది.
#4.చర్మం మెరుస్తుంది:
మనం ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం కావాలని కోరుకుంటే, ఎట్టి పరిస్థితిలోను బ్రేక్ ఫాస్ట్ మానకూడదు.ప్రతి రోజు ఉదయం మేల్కోగానే మన చర్మం నిస్తేజంగా ఉంటుంది.చర్మం తాజాగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటే కొంత శక్తి అవసరం.
#5.జీవక్రియ రేటు సమతుల్యం:
మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి జీవక్రియ అనేది ఒక ముఖ్యమైన విధి.బ్రేక్ ఫాస్ట్ అనేది శరీరంలో జీవక్రియ రేటును సమతుల్యం చేయటానికి సహాయం చేస్తుంది.