పసుపు( turmaric ) శుభకార్యాలకి కాకుండా ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగినది అని మనందరికీ తెలిసిందే.ఇందులో అధికంగా యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు( Anti-inflammatory properties ) ఉంటాయి.
అందుకోసం వంటల్లో పసుపుని తప్పనిసరిగా వాడుతూ ఉంటారు.అలాంటి పసుపు సీసం లా మారి ప్రాణాలను హరిస్తుందని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
అందుకోసం బంగ్లా దేశం ప్రభుత్వం పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు వస్తున్నాయి.నిజానికి పసుపు మంచిదా? కాదా ? ఇది ప్రాణాంతకంగా మారుతుందా అన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో పసుపు కూడా ఒకటి.
కానీ ఇప్పుడు మాత్రం ఇది మంచిది కాదని దీని వలన ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్( Bangladesh ) ప్రభుత్వం చెబుతోంది.దీని కారణంగా చాలామంది ప్రజలు చిన్నారుల గుండె మెదడు సంబంధిత జబ్బుల బారిన పడుతున్నట్లు పేర్కొంది.అయితే 2019లో పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది.ఈ పసుపు బంగ్లాదేశ్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయట పెట్టింది.
అయితే పసుపు వినియోగం కారణంగా చాలామంది శరీరంలోనీ రక్తంలో సీసం చేరి ప్రాణాలు తీస్తుందని వివరించండి.అసలు ఇది ఎలా జరుగుతుందన్నది పలు అధ్యయనాలు జరపగా పసుపు కల్తీ కి గురవడం వలన ఇలా జరుగుతుందని తేలింది.
ముఖ్యంగా హోల్సేల్ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్ అధికారులు.అయితే ఈ కల్తీ కి అడ్డుకవేసేలా బంగ్లాదేశ్ బజారులలో పెద్ద ఎత్తున హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.దీని ఫలితంగా రెండేళ్లలో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ కట్టడి చేయడం జరిగింది.ఇక పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు.
అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీకి గురవుతున్నట్లు గుర్తించారు.కాబట్టి కల్తీ ఉన్న ప్యాకెట్ల పసుపును వాడే కన్నా.పసుపు కొమ్ములను పౌడర్ గా చేసి వాడడం మంచిది.