టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమా తర్వాత అదే ఊపుతో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలో నటిస్తూ బిజీ ఉన్నాడు.
ఇక ప్రభాస్ నటించిన తదుపరి చిత్రం సలార్.ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే ప్రభాస్ నటిస్తున్న మరొక పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె.కాగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా కోసం మధ్యలో ముంబై వెళ్లాల్సి వస్తోంది.
ఈ క్రమంలోనే ప్రభాస్ తన ఫిజిక్ ని ఒక పద్ధతిలో ఉంచుకోవడం చాలా కష్టం అవుతోంది. సలార్ సినిమా యాక్షన్స్ అన్ని విషయాలతోనే కూడి ఉంటుంది.
యష్,కెజిఎఫ్ సినిమాలో ఏ విధంగా అయితే తన ఫిజిక్ నేమ్ చేశాడో అదే విధంగా సలార్ లో కూడా ప్రభాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందట.కానీ ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్స్ కోసం తిరుగుతూ ఉండటం వల్ల.
సలార్ సినిమా లో ప్రభాస్ లుక్ మారిపోతుండటంతో ఆ చిత్ర దర్శకుడు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే చాలా వరకు యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్‌కు బదులు ఆయన డూప్‌ను పెట్టి తీసినట్టు కూడా తెలుస్తోంది.
కాగా ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో ఏ విధంగా అయితే డూప్ నటించారో,ఈ సలార్ సినిమాలో కూడా డూప్ తోనే పని ఎక్కువన్నమాట.అందువల్లే దర్శకుడు ప్రశాంత్ నీల్.ప్రభాస్ కన్నా అతని డూప్ నే ఎక్కువగా నమ్ముకున్నాడట.ప్రభాస్ అవుట్ ఆఫ్ ఫోకస్ వున్నాడని, అందువల్ల డూప్‌ని పెట్టి చాలా సన్నివేశాలు తీసేస్తున్నారట.అయితే సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాస్త అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రభాస్ డూప్ బాగున్నాడు కాబట్టి అతనితో పని అయిపోతున్నందుకు సినిమా ఆగకుండా వున్నందుకు సంతోషంగానే వున్నాడట.డూప్ అంటే సినిమా మొత్తం అతనే చేసేస్తాడని అనుకోవద్దు క్లోజ్ అప్ షాట్స్‌లో మన రియల్ హీరో ఉండగా మిగతా యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా డూప్ తోనే చేస్తారట.
అయితే ఏది ఒరిజినల్, ఏది డూప్ తేడా తెలియకుండా ఈ మధ్య ఒరిజినల్‌కి బాగా దగ్గరగా ఉండే డూప్‌లను వెతికి మరి పట్టుకొస్తున్నారు.