చైతన్య, శోభిత కాంబోలోలో ఆ సినిమా మిస్సైందా.. సమంత నటించిన ఆ సినిమా ఇదే!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ప్రస్తుతం తండేల్ (Tandel)సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi)హీరోయిన్ గా నటిస్తోంది.

 Do You Know This Movie Where Samatha Naga Chaitanya And Sobhita Dhulipala Acted-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇకపోతే ఇటీవలే నాగచైతన్య(Naga chaitanya) హీరోయిన్ శోభిత ధూళిపాలన(sobhita dhulipala) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీరి వివాహం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు.

పెళ్లి తర్వాత ఆలయాలకు వెళ్తూ బిజీగా ఉన్నారు.

Telugu Majili, Naga Chaitanya, Sai Pallavi, Samantha, Tandel-Movie

అయితే నాగ చైతన్య శోభిత(naga chaitanya, sobhita ) కంటే ముందు సమంతను(Samantha) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ చైతన్య, సమంత(chaitanya, samantha) కలిసి ఏ మాయ చేసావే సినిమాలో నటించారు.ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.అయితే అనుకోని కారణాల వల్ల సమంత, నాగ చైతన్య విడిపోయారు.

స్టార్ కపుల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సామ్, చై విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు సమంత, చైతన్య.

ఇక విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు.సమంత మాయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది.

ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది.

Telugu Majili, Naga Chaitanya, Sai Pallavi, Samantha, Tandel-Movie

మరో వైపు నాగ చైతన్య తన సినిమాలతో బిజీగా మారిపోయాడు.ఈ క్రమంలోనే శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు.శోభిత, నాగ చైతన్య కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

కానీ సమంత, నాగచైతన్య, శోభిత(,naga chaitanya, samantha, sobhita) కలిసి ఒక సినిమాలో నటించారని తెలుస్తోంది.ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ సినిమా ఏదో కాదు మజిలీ(Majili).శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.

Telugu Majili, Naga Chaitanya, Sai Pallavi, Samantha, Tandel-Movie

ఈ సినిమాలో ముందుగా దివ్యాంక కౌశిక్ పాత్రకు హీరోయిన్ శోభితను ముందుగా అనుకున్నారట డైరెక్టర్.శోభితతో రెండు మూడు సీన్స్ కూడా షూట్ చేశారట.ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.దాంతో ఆమె ప్లేస్ లోకి దివ్యాంక కౌశిక్(Divyanka Kaushik) ను తీసుకున్నారట.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది.మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube