దంతాలు తెల్లగా ఆరోగ్యంగా మారాలా.. అయితే రోజు ఇలా చేయడం అస్సలు మరవకండి!

తమ దంతాలు( Teeth ) ఆరోగ్యంగా మారాలని, తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.కానీ కొందరు మాత్రమే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు.

 Follow These Tips For White And Healthy Teeth , Healthy Teeth, Teeth Whitening R-TeluguStop.com

మిగతావారు మాత్రం ఏదో మొక్కుబడిగా రోజు మార్నింగ్ బ్రష్ చేసుకుని సరిపెడుతుంటారు.కానీ శుభ్రమైన ఆరోగ్యమైన తెల్లటి దంతాలు కావాలంటే కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ అవసరం.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను రోజు పాటించారంటే మీ దంతాలు తెల్లగా ఆరోగ్యంగా మారడం ఖాయం.అందుకోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి.

Telugu Tips, Healthy Teeth, Latest, Oil, Oral, Teeth Remedy, White Teeth-Telugu

ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్( Carrot ) ను తీసుకుని పీల్ తొలగించి శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన క్యారెట్ ను సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్యారెట్ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), వన్ టేబుల్ స్పూన్ మీ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా నోటిని మరియు దంతాలను క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Healthy Teeth, Latest, Oil, Oral, Teeth Remedy, White Teeth-Telugu

నిత్యం ఈ చిట్కాలను పాటించారంటే మీ దంతాల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.ఆయిల్ పుల్లింగ్ నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశ‌నం చేస్తుంది.కావిటీస్ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలను తగ్గిస్తుంది.ఆయిల్ పుల్లింగ్ చేయ‌డం వ‌ల్ల‌ నోటి దుర్వాసనకు సుల‌భంగా చెక్ పెట్ట‌డ‌వ‌చ్చు.నోటి దుర్వాసనను తగ్గించేందుకు ఇది సహజమైన ప్రత్యామ్నాయం.అలాగే పసుపు మరియు క్యారెట్ ను దంతాలు తోముకోవడంలో ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.దంతాలు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.

దంతాల పసుపు వదిలిపోతుంది.దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి.

మరియు చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాల పోటు వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube