సాధారణంగా మనలో చాలా మందికి ముఖంపై ముదురు రంగు మచ్చలు ( Spotless )కనిపిస్తుంటాయి.చర్మం ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా కూడా ఈ మచ్చలు కారణంగా ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే ముఖం పై ఉన్న మచ్చలను వదిలించుకునేందుకు ఖరీదైన క్రీమ్, సీరం వంటి ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే ఎన్ని వాడినా కూడా మచ్చలు పోవడం లేదా.
వర్రీ వద్దు కేవలం 10 రూపాయల ఖర్చుతో ఈజీగా మచ్చలను తరిమి కొట్టవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర..( Coriander leaves )ఏ నాన్ వెజ్ వండినా కూడా ఇది ఉండాల్సింది.ఆహారానికి చక్కని రుచి ఫ్లేవర్ ను అందించడంలో కొత్తిమీర చాలా బాగా సహాయపడుతుంది.
అలాగే కొత్తిమీరలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి.అంతేకాదు చర్మ సౌందర్యాన్ని పెంచే సత్తా కూడా కొత్తిమీరకు ఉంది.
ముఖ్యంగా మచ్చలను నివారించడానికి కొత్తిమీర ఉత్తమంగా సహాయపడుతుంది.కేవలం పది రూపాయలు ఖర్చుపెట్టి కొత్తిమీరను తెచ్చుకుంటే మచ్చలేని చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర ఆకులు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనె,( Honey ) వన్ టేబుల్ స్పూన్ షుగర్( Sugar ) మరియు కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయమవుతాయి.కొద్దిరోజుల్లోనే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్( Glowing skin ) మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ రెమెడీ మొటిమలకు అడ్డుకట్ట వేస్తుంది.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.
కాబట్టి స్పాట్ లెస్ స్కిన్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీ ని ఫాలో అవ్వండి.