చలి కాలం ప్రారంభం అయింది.ఈ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్య పెదాల పగుళ్లు.
చల్ల గాలులు, శరీరంలో వాటర్ శాతం తగ్గి పోవడం, పెదవులపై తేమ ఆవిరి అయిపోవడం, పోషకాల లోపం, ఆహారపు అలవాట్లు.ఇలా రకరకాల కారణాల వల్ల పెదాలు పొడి బారిపోయి పగిలిపోతూ ఉంటాయి.
దాంతో ఈ సమస్యను నివారించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ లిప్ బామ్‌ను యూజ్ చేస్తే గనుక.
పెదాల పగుళ్లు తగ్గు ముఖం పడతాయి.అలాగే ముందు ముందు పెదాలు పగుళ్ల సమస్యే దరి చేరకుండా ఉంటుంది.
మరి ఆ న్యాచురల్ లిప్ బామ్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బీట్ రూట్, ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పేస్ట్ నుంచి రసం తీసుకుని.స్టవ్‌పై ఒక పావు గంట పాటు దగ్గర పడే వరకు హీట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చి.ఆపై ఇందులో రెండు విటమిస్ సి క్యాప్సుల్స్ ఆయిల్, రెండు స్పూన్ల వాసెలిన్, పావు స్పూన్ బాదం ఆయిల్ వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే లిప్ బామ్ రెడీ అయినట్టే.
ఈ న్యాచురల్ లిప్ బామ్‌ను ఒక గాజు డబ్బాలో నింపుకుని.ఫ్రీజ్‌లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.ఇక ఈ లిప్ బామ్‌ను తరచూ వాడితే గనుక పెదాలు పగలనే పగలవు.ఒక వేళ పగిలి ఉన్నా.
తగ్గి పోయి లిప్స్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా మారతాయి.మరియు ఈ న్యాచురల్ లిప్ బామ్‌ను యూజ్ చేయడం వల్ల పెదాలు ఎర్రగా, అందంగా కనిపిస్తాయి.