ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్ వాడితే..పెదాలు ప‌గ‌ల‌నే ప‌గ‌ల‌వు!

ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్ వాడితేపెదాలు ప‌గ‌ల‌నే ప‌గ‌ల‌వు!

చ‌లి కాలం ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య పెదాల ప‌గుళ్లు.

ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్ వాడితేపెదాలు ప‌గ‌ల‌నే ప‌గ‌ల‌వు!

చ‌ల్ల గాలులు, శ‌రీరంలో వాట‌ర్ శాతం త‌గ్గి పోవ‌డం, పెద‌వుల‌పై తేమ ఆవిరి అయిపోవ‌డం, పోష‌కాల లోపం, ఆహార‌పు అల‌వాట్లు.

ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్ వాడితేపెదాలు ప‌గ‌ల‌నే ప‌గ‌ల‌వు!

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పెదాలు పొడి బారిపోయి ప‌గిలిపోతూ ఉంటాయి.దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ లిప్ బామ్‌ను యూజ్ చేస్తే గ‌నుక‌.పెదాల ప‌గుళ్లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే ముందు ముందు పెదాలు ప‌గుళ్ల స‌మ‌స్యే ద‌రి చేర‌కుండా ఉంటుంది.మ‌రి ఆ న్యాచుర‌ల్ లిప్ బామ్ ఏంటీ.

? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాలు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా ఒక బీట్ రూట్‌, ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా క‌డిగి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ పేస్ట్ నుంచి ర‌సం తీసుకుని.స్ట‌వ్‌పై ఒక పావు గంట పాటు ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు హీట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార్చి.ఆపై ఇందులో రెండు విట‌మిస్ సి క్యాప్సుల్స్ ఆయిల్‌, రెండు స్పూన్ల వాసెలిన్, పావు స్పూన్ బాదం ఆయిల్ వేసుకుని బాగా క‌లిసేలా మిక్స్ చేసుకుంటే లిప్ బామ్ రెడీ అయిన‌ట్టే.

ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్‌ను ఒక గాజు డ‌బ్బాలో నింపుకుని.ఫ్రీజ్‌లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఇక ఈ లిప్ బామ్‌ను త‌ర‌చూ వాడితే గ‌నుక పెదాలు ప‌గ‌ల‌నే ప‌గ‌ల‌వు.

ఒక వేళ ప‌గిలి ఉన్నా.త‌గ్గి పోయి లిప్స్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా మార‌తాయి.

మ‌రియు ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్‌ను యూజ్ చేయ‌డం వ‌ల్ల పెదాలు ఎర్ర‌గా, అందంగా క‌నిపిస్తాయి.

తమన్నా ఓదెల2 సినిమాకు భారీ షాక్.. ఆ పేరును అభ్యంతరకరంగా వాడారంటూ?

తమన్నా ఓదెల2 సినిమాకు భారీ షాక్.. ఆ పేరును అభ్యంతరకరంగా వాడారంటూ?