తెలుగు సినిమా పాటకి తమ అక్షరమాలతో అందాన్ని అద్దిన గీత రచయతలు చాలా మందే ఉన్నారు.వారిలో గోరటి వెంకన్నది ప్రత్యేక శైలి.
ప్రముఖ ప్రజాకవి, గాయకుడుగా పేరు పొందిన ఆయన సినిమా పాటతో కూడా సమానంగా తన ప్రయాణాన్ని కొనసాగించారు.అయితే.
, ఆయన సినీ ప్రయాణం కాస్త చిత్రంగానే మొదలయింది.వెంకన్న ఓ నాటకం కోసం “రాజ్యహింస పెరుగుతున్నాదో… పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో” అనే పాట రాశాడు.
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ కి ఆ పాట అద్భుతంగా నచ్చింది.ఈ పాట రాసింది ఎవరా అని వెతికితే… రెండు నెలలకి వెంకన్న దర్శకుడు శంకర్ కి చిక్కారు.కానీ.శంకర్ పాట రాయాలని అడిగితే గోరటి వెంకన్న సినిమా పాటని రాయడం చిన్నతంగా భావించారు.అందుకు సస్సేమేర అన్నారు.
చివరికి మిత్రుల ప్రోద్భలంతో ‘జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో‘ అనే పాటను రాశాడు వెంకన్న.పాట సూపర్ హిట్.
తరువాత “కుబుసం” సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట.అందరి చేత కన్నీరు పెట్టించింది.రచయతగా గోరటి వెంకన్నకి కూడా మంచి పేరు వచ్చింది.కానీ., ఇంత పేరు వచ్చినా., ఆయన సినిమా పాటని సీరియస్ గా తీసుకోలేదు.
ప్రజా కవిగానే ఉండటానికి ఇష్టపడ్డారు.

అయితే.
, జీవితంలో ఒక మంచి ఆశయం పెట్టుకుని ప్రజల కోసం కష్టపడుతున్న సమయంలో ఒక లేడీ అన్న మాటలు తనని బాగా బాధపెట్టాయట.వెంకన్నకి కనీసం ఇల్లు కూడా లేదు.
తాగుతాడు., ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు.
బాధ్యత లేని మనిషి అంటూ.ఆమె గోరటి వెంకన్న పై విమర్శలు చేసిందట.ఈ విషయాన్ని స్వయంగా ఆయన మీడియా ముందు ప్రస్తావించారు.“నేను జీవితంలో చాలా అవకాశాలు వదులుకొని ప్రజల కోసం పాటలు రాశాను.అలాంటి నన్ను పట్టుకొని ఇలా అవమానించడం భావ్యం కాదని అనిపించింది.అందుకే 2005లో ఇష్టం వచ్చినన్ని పాటలు రాశాను.ఆ ఏడాది ముందు 6 నెలలలోనే చాలా డబ్బు సంపాదించా.అవన్నీ నా భార్యకి ఇచ్చేశా.
ఆమె ఆనందంగా ఇల్లు కట్టుకుంది” .ఇందుకోసం ఐటెం సాంగ్స్ కూడా రాయాల్సిన పరిస్థితి కూడా ఎదుర్కొన్నాఅని గోరటి వెంకన్న తెలియ పరిచాడు.అయితే., గోరెటి వెంకన్న ప్రస్తుతం కబీర్ సమ్మాన్’ జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు.దీనికి గాను ఆయనకి మూడు లక్షలు పైగా బహుమతి వస్తుంది.త్వరలోనే ఆయనకి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇవ్వబోతోంది.
ఇక జీవితంలో ఆయన ఎన్నో అవార్డ్స్ పొందినా., వై.
ఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన బహుమతిని మాత్రం జీవితంలో మరచిపోలేను అని ఆయనే స్వయంగా వెల్లడించారు.