తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకి ఉన్న క్రేజ్ తెలుగు సినిమా హీరోల్లో ఇంకెవరికీ లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇప్పటికే ఆయన ఇటు సినిమాలు చేస్తూనే, అటు రాజకీయంగా కూడా రాణిస్తున్నాడు.ఇక డిప్యూటీ సీఎం గా బాధ్యతలు పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగతా సినిమాల మీదికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ గత సినిమాలతో మంచి విజయాలను అందుకున్నప్పటికీ కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలు ఏవి అంత పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి.కాబట్టి ఇప్పుడు రాబోయే ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పైన ఆయన ఎక్కువ అంచనాలను పెట్టుకున్నాడు.ఇక ఇతర అభిమానులు కూడా ఆ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ షో యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు.ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు మీరు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని అడిగాడు.
ఇక అనసూయ దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నేను ఒక చిన్న పాత్రలో నటిస్తున్నాను అని చెప్పారు.
ఇంతకీ అది ఏ సినిమా అనే విషయం అయితే ఆమె క్లారిటీ ఇవ్వలేకపోయింది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu )’ సినిమాలో అనసూయ ఒక క్యారెక్టర్ పోషిస్తుందని న్యూస్ కూడా బయటకు వచ్చింది.కాబట్టి ప్రస్తుతానికైతే ఆమె అదే సినిమాలో ఒక పీడిత ప్రాంతం లో ఉన్న జనాలకు లీడర్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో అనసూయ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుంది అనేది…
.