అర్జెంట్ గా శంకర్ కి ఒక రైటర్ కావాలా..? భారతీయుడు 2 సినిమాలో అదే లోటు కనిపించిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రాజమౌళి.ఆయన సినిమాల్లో కథ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.

 Shankar Urgently Needs A Writer..? Did The Same Deficiency Appear In Bharathidud-TeluguStop.com

ముఖ్యంగా వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) అందించిన కథకు రాజమౌళి తుది మెరుగులు దిద్ది చక్కటి స్క్రీన్ ప్లే రాసుకొని సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతూ ఉంటాడు.అయితే ఇప్పటివరకు ఆయన రాసిన ప్రతి కథ విషయంలో ఇలాగే జరుగుతుంది.

కానీ రాజమౌళి స్వతహాగా కథ రాసుకోలేడు కాబట్టి వాళ్ళ నాన్న కథలను తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తు ఉంటాడు.

 Shankar Urgently Needs A Writer..? Did The Same Deficiency Appear In Bharathidud-TeluguStop.com
Telugu Sshankar, Indian, Rajamouli, Ram Charan-Movie

ఇక ఇదే విషయంలో శంకర్( S Shankar ) మాత్రం తనకు సరైన కథ దొరకడం లేదనే ఉద్దేశ్యంతోనే సినిమాలను సరిగ్గా చేయలేకపోతున్నాడు.రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2 సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేకపోతుందనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాలో కథ ఓకే అనిపించినప్పటికీ దాన్ని సరైన పద్ధతి లో విస్తరించలేకపోయారు.

కాబట్టి సినిమాలో కథ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ అది ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది…ఇక అందుకే రాజమౌళి కథ విషయంలో వేరే వాళ్ళ మీద ఆధార పడ్డట్టుగా శంకర్ కూడా అలాగే వేరే వాళ్ళ కథలను తీసుకొని సినిమాలుగా చేస్తే సక్సెస్ లు దక్కుతాయి అంటూ మరి కొంతమంది శంకర్ అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telugu Sshankar, Indian, Rajamouli, Ram Charan-Movie

మరి ఇప్పటికైనా శంకర్( Director S Shankar ) వేరే వాళ్ళ కథలు తీసుకొని సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక అందులో భాగంగానే శంకర్ గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్ సుబ్బరాజు కథ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో తను సక్సెస్ కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే శంకర్ కి ఒక మంచి రైటర్ కావాలి అనేది మాత్రం చాలా స్పష్టం గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube