టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కొడుకు, కూతురు సత్తా చాటడం పక్కా.. ఇద్దరూ ఇద్దరే అంటూ?

ఘట్టమనేని మూడవ తరం వారసుడిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) కొడుకు గౌతమ్( Gautam ) ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.అయితే ప్రస్తుతం గౌతమ్ కేవలం స్టడీస్ పైన మాత్రమే ఫోకస్ చేయడంతో ఇంకా గౌతమ్ ఎంట్రీ కోసం కనీసం ఒక అయిదారేళ్ళు పట్టవచ్చని తెలుస్తోంది.

 Latest Vnews Viral About Mahesh Babu Daughter Sitara And Gautham Details, Mahesh-TeluguStop.com

ప్రస్తుతం ప్లస్ 2 పూర్తయింది.బ్యాచులర్స్ చేయాలి.

ఈ మేరకు అమెరికాలో బ్యాచులర్ డిగ్రీ కోర్స్ లో జాయిన్ కాబోతున్నాడు గౌతమ్ అని తెలుస్తోంది.అయితే అమెరికాలో వుంటూ కేవలం బ్యాచులర్ డిగ్రీ చేస్తే ఎలా? ఎప్పటికైనా కెమేరాను ఫేస్ చేయాలి.

Telugu Gautham, Mahesh Babu, Namrata, Sitara, Sitaragautam, Tollywood-Movie

అందుకే న్యూయార్క్ లోని ప్రఖ్యాత ఫిలిం శిక్షణ సంస్థలో గౌతమ్ ను జాయిన్ చేయబోతున్నారని తెలుస్తోంది.డిగ్రీతో పాటు నట శిక్షణ పొంది తిరిగి వస్తారన్నమాట.ఎలా లేదన్నా నాలుగైదు ఏళ్లు పడుతుంది ఇంతా జరిగేసరికి.అప్పుడు పాతికేళ్లకు దగ్గర పడతాడు గౌతమ్.సినిమా ఎంట్రీకి పెర్ ఫెక్ట్ టైమ్ అని చెప్పాలి.మరోవైపు మహేష్ బాబు ముద్దుల కూతురు సితార( Sitara ) కూడా సినిమాలలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కమర్షియల్ యాడ్స్ చేసి భారీగా క్రేజ్ నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సితార.

Telugu Gautham, Mahesh Babu, Namrata, Sitara, Sitaragautam, Tollywood-Movie

ఒకవేళ సితార సినిమాలలోకి ఎంట్రీ ఇస్తుందా అంటే ఆమె ఎంట్రీ ఇవ్వడానికి కూడా కనీసం ఐదారేళ్ళ సమయం పట్టేటట్టుగానే కనిపిస్తోంది.రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.ఘట్టమనేని అభిమానులు కూడా సితార, గౌతమ్ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుత ఎదురుచూస్తున్నారు.

మరోవైపు తండ్రి మహేష్ బాబు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు మహేష్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube