కొన్నిసార్లు ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వచ్చిన సినిమాలు ఆయా చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపుతాయి.అలాంటి సినిమాల్లో ఒకటి బిచ్చగాడు మూవీ.
తమిళ డైరెక్టర్ శశి ఒకరోజు తన ఇంట్లోని పుస్తకాలను సర్దుతుండగా ఓ పేపర్ కనిపించింది.అందులో బిచ్చగాడుగా మారిన బిజినెస్ మ్యాన్ అనే వార్త కనిపిస్తుంది.
అతడికి ఈ వార్త ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఆ రోజు రాత్రి కూడా తన కలలోకి అదే వార్త వస్తుంది.
వెంటనే తను మంచి కథ రాయడం మొదలు పెడతాడు.కొద్ది రోజుల్లోనే చక్కటి కథ రెడీ అవుతుంది.
అదిరిపోయే ఈ స్టోరీతో మంచి సినిమా తీయాలనుకుంటాడు.అనుకున్నదే ఆలస్యంగా పలురువు ప్రొడ్యూసర్లకు, హీరోలకు ఈ స్టోరీ వినిపిస్తాడు.
కానీ బిచ్చగాడు అనే కాన్సెప్ట్ వారికి అంతగా నచ్చలేదు.అయినా శశి తన ప్రయత్నాలను వదులుకోలేదు.
తన కథ మీద ఉన్న నమ్మకంతో ముందుకు సాగాడు.
సరిగ్గా అదే సమయంలో విజయ్ ఆంటోని దగ్గరకు వెళ్లాలనుకున్నాడు.
ఓరోజు ఆయన టైం తీసుకుని వెళ్లి కలిస్తే స్టోరీ నచ్చితే తనే ప్రొడ్యూసర్ కూడా.సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటాడు.
ఒకరోజు కథతో వెళ్లి విజయ్‌ని కలుస్తాడు.స్టోరీ వినిపిస్తాడు.
తనకు ఈ స్టోరీ బాగా నచ్చిందని చెప్తాడు.తనే ప్రొడ్యూసర్‌గా చేస్తానని చెప్తాడు.
తొలుత వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా.చివరకు విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తాడు.
ఓ శుభ ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారు.సుమారు 2 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేస్తారు.అన్నీ సక్రమంగా జరిగి సినిమా రెడీ అవుతుంది.సైలెంట్‌గా రిలీజైన ఈ మూవీ తమిళనాట సంచలనంగా మారింది.సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లింది.40 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.ఇదే సినిమాను తెలుగలోకి రీమేక్ చేయాలని శశి భావించాడు.రానాతో పాటు సునిల్‌ను హీరోలుగా చేసేందుకు సంప్రదించాడు.అయితే ఈ కథ ఇక్కడ జనాల్లోకి ఎక్కదని అందుకు ఓకే చెప్పలేదు.ఇదే అదునుగా లక్ష్మణ్ చదవలవాడ 45 లక్షలు పెట్టి డబ్బింగ్ రైట్స్ తీసుకున్నాడు.
తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశాడు.ఇదే సమయంలో తెలుగులో సరైనోడు, బ్రహ్మోత్సవం, నాని జెంటిల్మెన్, నితిన్ అ,ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
బ్రహ్మోత్సవం హిట్ కాకపోవడం, బిచ్చగాడుకు కలిసి వచ్చింది.ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
తెలుగు ఇండస్ట్రీలో సుమారు 20 కోట్ల రూపాయలను వసూలు చేసింది.మొత్తంగా ఈ సినిమా ఎంతో మంది తలరాతలను మార్చింది.