ట్రంప్‌పై హత్యాయత్నం..దుండగుడు రక్షణ వలయాన్ని ఎలా ఛేదించగలిగాడు..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) హత్యాయత్నంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.శనివారం పెన్సిల్వేనియాలోని( Pennsylvania ) బట్లర్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు చేసిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్గొన్నారు.దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఆగంతకుడు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.15 గంటలకు కాల్పులకు తెగబడ్డాడు.కాల్పుల శబ్ధం వినిపించిన వెంటనే ట్రంప్ పోడియం కిందకి చేరి తనని తాను రక్షించుకున్నారు.వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయనకు రక్షణ కవచంలా నిలిచారు.అప్పటికే బుల్లెట్ ట్రంప్ కుడి చెవి మీదుగా వెళ్లి గాయమైంది.భారీ భద్రత మధ్య ఆయనను ఆసుపత్రికి తరలించారు.

 Fbi Confirms Shooter As 20-year-old Thomas Matthew Crooks Who Attack On Donald T-TeluguStop.com

మరోవైపు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్( Sniper Shooter ) వేగంగా స్పందించి.దుండగుడిని మట్టుబెట్టాడు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Telugu Attackdonald, Donald Trump, Donaldtrump, Pennsylvania, Republican, Shoote

అయితే అమెరికా అధ్యక్షుడికి ఏ స్థాయిలో భద్రత ఉంటుందో, అదే స్థాయిలో మాజీ అధ్యక్షులకు సైతం సెక్యూరిటీని కల్పిస్తారు.ఇక ట్రంప్ వంటి శక్తివంతమైన వ్యక్తులకు, అందులోనూ అధ్యక్ష బరిలో నిలిచిన వ్యక్తికి ఏ స్థాయిలో భద్రత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.యూఎస్ సీక్రెట్ సర్వీస్,( US Secret Service ) ఎఫ్‌బీఐ,( FBI ) స్థానిక పోలీసులు , ఇతర కమెండోలు అనుక్షణం ట్రంప్‌‌‌కు డేగ కళ్లతో పహారా కాస్తుంటారు.ఇలాంటి రక్షణ వలయాన్ని ఛేదించుకుని దుండగుడు ఎలా కాల్పులు జరపగలిగాడనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Attackdonald, Donald Trump, Donaldtrump, Pennsylvania, Republican, Shoote

దుండగుడు ర్యాలీ జరుగుతున్న వేదికకు దగ్గరలోని భవనం నుంచి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.తుపాకీతో ర్యాలీకి వచ్చిన అగంతకుడు భవనంపైకి పాకడాన్ని తాము గమనించి పోలీసులకు సమాచారం అందించామని చెబుతున్నారు.ట్రంప్ వేదికపైకి వచ్చే సమయానికి అతను సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ట్రంప్‌పై దాడికి తెగబడిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్‌గా( Thomas Matthew Crooks ) గుర్తించారు.

నిందితుడు ఏఆర్ శ్రేణి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను దాడికి వినియోగించినట్లుగా ఎఫ్‌బీఐ తెలిపింది.ఈ ఘటనను హత్యాయత్నంగా ప్రకటించిన ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.మరికొద్దినెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌పై దాడి అమెరికన్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube