అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బలమైన రెండు జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ చిన్నా చితకా పార్టీలతో మూడో కూటమి ఏర్పడుతుందా? ఏర్పడితే నిలబడుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.ఇటీవల కేంద్రంతో డి అంటే డి అన్నట్లు సై అంటే సై అన్నట్లు వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి మూడో ప్రత్యామ్నాయం వైపు పయనిస్తుంది.
అయితే కెసిఆర్ తోఎవరు వస్తారు ఎవరూ కలిసిరారు అనే విషయం పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రాంతీయ పార్టీలు గుర్రుగా ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల నుంచి నదుల అనుసంధానం వరకు, కేంద్ర రాష్ట్రాల ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ అన్నీ తానై కేంద్రం వ్యవహరిస్తోంది.
రాజ్యాంగం నిర్దేశించిన 3 జాబితాలోని రాష్ట్ర అంశాల్లోకి కేంద్ర ప్రభుత్వం చొర బడుతూ కేంద్ర ప్రభుత్వపు ఒంటెత్తు పోకడలను చాలా రాష్ట్రాలు జీర్ణించు కోలేక పోతున్నాయి.దానికి తోడు ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ప్రాంతీయ ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడంలో రెండు జాతీయ పార్టీలు గోరంగా విఫలమై రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశారన్న వాదన ఉంది.
ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది.దీంతో బీజేపీ మస్ట్ గో అని గర్జించిన కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
వరుస ప్రెస్ కాన్ఫరెన్స్ లు బహిరంగ సభలు పెట్టి విమర్శించి దేశం దృష్టిని ఆకర్షించారు.దేశంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతుంది అంటూ సీఎం కేసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీ నేతలను కలిశారు.
ఇందులో భాగంగా మహారాష్ట్రలో శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సీనియర్ నేత శరత్ పవర్ లను కలిశారు.అంతకుముందు దేశంలో కీలక మహిళా నేత ఫైర్ బ్రాండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి లను కలిశారు.
భవిష్యత్తులో జమ్ము కాశ్మీర్ నేతలను కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.దేశమంతా చుట్టేసి బిజెపి కాంగ్రెస్ జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న 10 ప్రధాన పార్టీల లను ఏకం చేసి ప్రాంతీయ పార్టీల శకం ప్రారంభానికి ఓసారి శ్రీకారం చుట్టాలు ఉన్నారా అంటే అవుననే అనిపిస్తుంది.
దీనికి ఏకైక విరుగుడు పెట్రోల్ సర్కార్ అనేది కేసీఆర్ వాదన.

గతంలోనే 2019లో ఈ ప్లాన్ వర్క్ అవుట్ కాకున్నా ఇప్పటి నుంచి మొదలు పెడితే 2024 ఎన్నికల నాటికి ఒక రూపు ఆయన వస్తుందని భావిస్తున్నారు.దానికి తగ్గట్టే దేశంలో ప్రాంతీయ పార్టీలకు జాతియ ఆకాంక్షలు పెరుగుతున్నాయి.మోడీకి వ్యతిరేక కూటమి కట్టడానికి రెడీ అయిపోయి ఇంతవరకు క్లియర్ బీజేపీ వ్యతిరేక సీఎంల సమావేశం జరగబోతుందనీ అంటున్నారు.
తిరిగి కెసిఆర్ అందరని కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీంతో ఈ కూటమిపై త్వరలోనే స్పష్టత రావాల్సిన సంకేతాలు ఉన్నాయి.అయితే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉంటాయి.కానీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కూటమిలవి అనుమానాలు ఉన్నాయి.
గతంలో కూడా నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగాలు జరిగినా చేసినా అవి ఎంతో కాలం కొనసాగలేవు.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ బి.జె.పి కూటమి లతో రెండు కూటమిలు ఉన్నాయి.
పార్టీలను లేదా కాంగ్రెస్ ను పెద్దగా వ్యతిరేకించిన పార్టీలు కలుస్తున్నారు.
దీని ఫలితంగా కాంగ్రెస్ ఫ్రంట్ వీక్ అవుతుందేమో కానీ బీజేపీకి నష్టం ఏంటి అన్న ప్రశ్న ఈ కూటములకు బీజీపీ మిత్రలను లాగడం వల్ల ప్రయోజనం ఉండొచ్చు కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది తేలాలి.స్టాలిన్,శరత్ పవార్ లాంటి వారంతా ఎప్పట్నుంచో కాంగ్రెస్ కు అనుకూలం వీరిలో కాంగ్రెస్ కు సంబంధం ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
మమత బెనర్జీ కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఎదగాలని భావిస్తారు తప్పబీజీపీ తో ఉన్న శతృత్వం కాంగ్రెస్ తో లేదు.ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ కి సాఫ్ట్ కార్నర్ తోనే మాట్లాడుతున్నారు దేశంలో ఏకస్వామ్యం పార్టీలు పోయి సంకీర్ణ శకం మొదలైన తర్వాత బిజెపి ఇతర కాంగ్రెసేతర ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.81 చివర్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఏర్పాటైన నేషనల్ ఫ్రంట్ కు బిజెపి మద్దతు ఇచ్చింది.1990లో ద్వితీయార్థంలో వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది.ఈ ప్రభుత్వాలు పడిపోవడంలో సైతం జాతీయ పార్టీలే కీలకం అని చెప్పక తప్పదు.ఇలాంటి తరుణంలో ప్రాంతీయ పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేస్తే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియని పరిస్థితి.

బీజేపీకి అనుకూలంగా కనిపించిన బిజెపికి వ్యతిరేక కూటమిలో చేరడానికి పెద్ద కష్టం ఉండక పోవచ్చు ఇవన్నీ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ కాదు ఇలాంటి తరుణంలో బీజేపీకి కాంగ్రెస్ రెండూ లేకుండా కనీసం కూడా సపోర్ట్ లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా అడుగులు వేస్తారు కాబట్టి తీసుకుంటారా కెసిఆర్ ప్రయత్నాలు సఫలమౌతాయి.దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి పాలించిన ప్పటికీ బీజేపీ వ్యూహం చేతిలో ఓటమి తప్పలేదు.కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా బలహీనంగా ఉంటుంది.బీజేపీ వ్యతిరేక కూటమి ఇదే సరైన సమయం అని కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరుగుతూ సర్జికల్ స్ట్రైక్ అని ఒకసారి, మతాలను రెచ్చగొడుతున్నారనీ మరోసారి విమర్శలు చేస్తూ ఏకంగా కేంద్రంపై ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు ఒకే దేశంలో ఒకే పద్ధతిలో ఉండాలని ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్ లో ఒక మాదిరి తెలంగాణలో మరొక మాదిరి కొనుగోలు వ్యవహారంలో కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.
అంతేగాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చి హైదరాబాద్ లో ధర్నా చౌక్ కేంద్రంగా ధర్నా నిర్వహించి తానే పాల్గొని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
అంతేగాక ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీలోనే తేల్చుకుంటామని ప్రకటించి తెలంగాణ భవన్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి కేంద్రాన్ని కడిగేశారు.ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశంలో రైతు ఉద్యమాన్ని నడుపుతున్న రాకేష్ తిఖాయత్ ఆహ్వానించి ఆయనను పొగడ్తలతో ముంచెత్తి ఆయనతో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని తిట్టించారు.
అయితే కెసిఆర్ ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షకు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ మద్దతు తెలపలేదు.కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు.
అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితినీ ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేయడంలో పెద్దన్న పాత్ర పోషించారు.దానికి కీలక నాయకుడైన ఉద్యమ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం కలిసి వచ్చే వారితో గొంగళి పురుగు నాయనా ముద్దు పెట్టుకుంటాం… పదవులను గడ్డిపోచతో సమానంగా విసిరి కొడతాం…అని ఉద్యమంలో ప్రకటించి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు కెసిఆర్ అని చెప్పక తప్పదు.
చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను ఓడించి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు.

కాంగ్రెస్ బిజెపికి సంతకం పాటిస్తుంది మెహబూబా భక్తి గతంలో బిజెపి ఉండేవాడు ఫారూక్ అబ్దుల్లా కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంటాడు అన్నిటికీ మించి మమతాబెనర్జీ చాలా స్పీడ్ గా ఉంటారు.ఆమెన్ హ్యాండిల్ చేయడమే కూటమికి దాని సమన్వయం చేయడం నేతలకు పెద్ద టాస్క్ గా మారనుంది.కెసిఆర్పై విమర్శలు ఉన్న వ్యూహకర్తగా ఆయనకాయన సామర్థ్యం గట్టి గట్టిదే అని రుజువు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం నడిపించడంలో ఆయన యుక్తి సామాన్యమైనది కాదు.అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే.
కానీ అన్నిప్రాంతీయ పార్టీలకు స్థానిక అంశాలు ప్రధానం.జాతీయ ఆకాంక్షలు ఉన్నా నా తమ రాష్ట్రాల ఈ ప్రయోజనం కోసం మొదటగా ఆలోచిస్తారు.
జాతీయ అంశాలు నదీజల వివాదాలు లాంటి సాంగ్స్ సంక్లిష్ట అంశాలపై ఎలాంటి ఇలాంటి స్టాండ్ తీసుకుంటారనేది కుటుంబ గౌరవాన్ని నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి.బిజెపి ని ఇంటికి పంపించాలన్న ఎజెండా ప్రధానంగా ఉన్నా మిగతా అంశాలపై క్లారిటీ తెలుసుకుంటేనే కూటమి బలంగా ఉండే అవకాశం ఉంది.
ఇక కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమితో గెలుపే అందిన సిపిఐ అధికారంలో ఉంది.
మరి ప్రాంతీయ పార్టీ ఓటమి లతోనే వామపక్షాలు ఉంటాయా అనేది ఇంకా నిర్ధారణ నిర్ధారణకు రాలేదు.
ఇవన్నీ పక్కన పెడితే ప్రదాని పదవి ఎవరికి ఇస్తారు అనేది కూడా పెద్ద విషయమే ఇవన్నీ ఎలా ఉన్నా అటు మోడీని బిజెపి కూడా తక్కువ అంచనా వేయలేము.ఇంత నెగిటివ్ ప్రచారం జరిగితే దానంత లాభసాటిగా మార్చుకోవడం లో బిజెపి ఆరితేరింది.
డిమానిటైజేషన్ బిజెపికి పెడతా దెబ్బతీసిందని భావిస్తే రెండోసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 300కి పైగా సీట్లు వచ్చాయి.అన్నింటికి మించి బిజెపి ఉన్న హిందూత్వ ఎజెండా గతంలో లాగే బలంగానే ఉంది.
అయితే ధరల పెరుగుదల నిరుద్యోగం పారిశ్రామిక రంగం కుదేలు వడం ఆర్థిక రంగం నెల చూపించడం వంటి కారణాలు బలంగానే కనిపిస్తున్న అది మోడీని బీజేపీ ని దెబ్బతీస్తాయని భావించలేము దేశానికి మోడీ బిజెపి మోడీ అధికారులు పిచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది.కేంద్రానికి అహంకారం పెరిగిపోయిందని అభిప్రాయాలు పెరుగుతున్నాయి.
సీఎం లను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే ముప్పు తెచ్చే పరిస్థితులు కల్పించారు.ఇది మోడీపై ప్రాంతీయ పార్టీలకు ఉన్న అభిప్రాయం.ప్రాంతీయ పార్టీలపై కుటుంబ పార్టీ అని ముద్ర వేసి తానొక్కడినే దేశభక్తులు అన్నట్టుగా మోడీ ప్రాజెక్ట్ చేసుకోవడం చాలా పార్టీలకు నచ్చడం లేదు.
రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ తానొక రాజుగా భావిస్తున్నారని కెసిఆర్ డైరెక్ట్ గా అటాక్ చేశారు.ఈ ఆగ్రహం అసహనం నుంచే ఎలాగైనా కూటం కట్టాలని పట్టుదల చెప్తుంది పార్లమెంట్ కూడా గతంలో బిజెపికి సాఫీగా నడవడం లేదు.
ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తున్న బిజెపి ప్రాంతీయ పార్టీలను ఏం చేయాలో తెలియని సందిగ్దావ పరిస్థితిలో ఉంది.
బిజెపి కాంగ్రెస్ పై దాడి చేసినంత ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలపై కి వెళ్ళ లేక పోతోంది.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలే చాలా రాష్ట్రాల్లో బీజేపీ ని సవాల్ చేస్తున్నాయి.
పదికి పైగా రాష్ట్రాల్లో బిజెపికి ప్రధాన ప్రత్యర్థులుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.బెంగాల్ బీహార్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, తెలంగాణ,జార్ఖండ్, మహారాష్ట్ర ల్లో కాంగ్రెస్ నామమాత్రమే ఇక్కడ బలంగా ప్రాంతీయ పార్టీలు బిజెపి ని బలంగా సవాల్ చేస్తున్నాయి.
బీజేపీ అధికారం కోల్పోయిన చోట కూడా ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి.ఇది ప్రాంతీయ పార్టీల కూటమికి అనుకూలం ఇది కేసీఆర్ దూకుడుకు కారణం అయ్యుండొచ్చు.
దేశంలో ఇప్పటికే 200 పార్లమెంట్ స్థానాలు ప్రాంతీయ పార్టీలకు బలం ఉంది.ఇక్కడ మెజారిటీ జారీ స్థానాల్లో తమ గెలిస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
అయితే కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిస్తుంది కీలకంగా మారే అవకాశం ఉంది.రాహుల్ ఇప్పటికే ప్రధాని పదవిపై తనకు ఆశ లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కూడా ప్రధాని పదవి కంటే మోడి ఓటమినే ఎక్కువగా కోరుకుంటుంది.అందుకే ఈసారి ప్రధాని పదవి త్యాగం చేసి బిజెపి వ్యతిరేక కోటక్ కూటమికి మద్దతు ఇవ్వచ్చు అన్న అభిప్రాయాలున్నాయి.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఆలోపు సమీకరణాలు మారొచ్చు.

గతంలో ఫ్రంట్ లు పుట్టినప్పుడు అవినీతి ప్రధాన అంశంగా మారింది.ప్రజలు వాటిని తమ సమస్యలు గా తీసుకున్నారు.కానీ ఈసారి అంతకు మించిన ప్రమాదం దేశానికి పొంచి ఉందని ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి.
దేశ మౌలిక స్వరూపం దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని దేశాన్ని అధ్యక్ష తరహా పాలన మళ్ళించే కుట్ర జరుగుతుందని అన్ని పార్టీలు మండిపడుతున్నాయి.ప్రధాని మోడీ వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆ దిశగానే ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఆస్తి పరిచే ప్రయత్నం చేయడం, రాష్ట్రాలకు రాష్ట్రాల హక్కులను హరించడం దించడం పార్లమెంట్లో కీలక అంశాలపై కూడా చర్చ కు తావు లేకుండా చేయడం ఇలాంటివి బిజెపి మిత్రపక్షాలు కూడా అసంతృప్తి సెగలు రేకెత్తి స్తున్నాయి.అయితే వాటికి ప్రజల నుండి మద్దతు వస్తుందో చూడాలి.
సమయం సందర్భం కలిసినప్పుడు ఎన్డీఏ లో ఉన్న పార్టీలు కూడా తమ కూటమిలోకి వస్తాయని ఈక్వేషన్ కూడా కేసీఆర్ లో ఉండవచ్చు.బీహార్ సీఎం నితీష్ కుమార్ లాంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా బిజెపితో ఉంటారన్న గ్యారెంటీ లేని విషయం వాస్తవమే.
ఇన్ని ఈక్వేషన్స్ మధ్య కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అయితే అనేది ఆసక్తికర అంశం.
ఆటో ప్రాంతీయపార్టీలు ఏ మేరకు విజయం సాధిస్తాయని దానిపైనే ఆధారపడి ఉంటుంది.
గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు ఇద్దరు తెలుగువారు జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేశారు.దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగిన పార్టీలు ప్రాంతీయ పార్టీలను ప్రమోట్ చేశారు.
ప్రాంతీయ పార్టీల కూటమిలు అధికారంలో ఎక్కువకాలం లేనప్పటికీ కింగ్ మేకర్లు గామారిన మాట వాస్తవం.దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి కలుపుకొని పోవడానికి ఓపిక, సహనం శక్తియుక్తులేకాక లౌక్యం ఉండాల్సిన అవసరం ఉంది.
ఇవన్నీ తెలిసిన నాయకుల కోసం దేశం ఎదురు చూస్తోంది అవన్నీ క్వాలిటీస్ కెసిఆర్ లో ఉన్నాయా అన్న ఆలోచన మేధావి వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా దేశంలోని సీనియర్ నేతలు కాకుండా బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ చేపడుతున్న ప్రాంతీయ పార్టీల కూటమికి కలిసి వచ్చేది ఎవరు? కడదాక ఉండేది ఎవరు? ఎదురు చూడాల్సిందే.







