సీనియర్ ఎన్టీఆర్ నటించిన 295 సినిమాల మొత్తం కలెక్షన్లు ఎంతో తెలుసా?

నందమూరి తారక రామారావు ఆయన సినీ కెరీర్ లో మొత్తం 295 సినిమాలలో నటించారు.ఈ సినిమాలలో 278 సినిమాలు తెలుగు సినిమాలు కావడం గమనార్హం.

 Senior Ntr Total Movies Collections Details, Senior Ntr, Senior Ntr Movies, Sr Ntr Movies Collections, Sr Ntr 295 Movies, Mana Desam, Aggi Pidugu, Charana Dasi, Sr Ntr 100th Birthday, Lavakusha-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ నటించి విడుదలైన తొలి సినిమా మన దేశం కాగా ఈ సినిమాలో ఇన్ స్పెక్టర్ రోల్ లో అద్భుతంగా నటించి ఆయన మెప్పించారు.సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా పల్లెటూరి పిల్ల కాగా బి.ఎ.సుబ్బారావు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో తెరకెక్కిన గుండమ్మ కథ సీనియర్ ఎన్టీఆర్ 100వ సినిమా కావడం గమనార్హం.యోగానంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన కోడలు దిద్దిన కాపురం ఈయన డైరెక్షన్ లో తెరకెక్కిన 200వ సినిమా కావడం గమనార్హం.

 Senior Ntr Total Movies Collections Details, Senior Ntr, Senior Ntr Movies, Sr Ntr Movies Collections, Sr Ntr 295 Movies, Mana Desam, Aggi Pidugu, Charana Dasi, Sr Ntr 100th Birthday, Lavakusha-సీనియర్ ఎన్టీఆర్ నటించిన 295 సినిమాల మొత్తం కలెక్షన్లు ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్ చివరిగా నటించిన సినిమా మేజర్ చంద్రకాంత్ కాగా చివరిగా రిలీజైన సినిమా మాత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు కావడం గమనార్హం.ఒక అంచనా ప్రకారం సీనియర్ ఎన్టీఆర్ నటించిన మొత్తం సినిమాల కలెక్షన్లు 250 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

ఇప్పటి టికెట్ రేట్ల ప్రకారం ఈ మొత్తాన్ని లెక్కిస్తే 10,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఆయన నటించిన మొత్తం సినిమాల కలెక్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది.

చరణదాసి సినిమా సీనియర్ ఎన్టీఆర్ తొలిసారి రాముడి పాత్రలో నటించిన సినిమా కావడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ నటించిన చండీ రాణి సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైంది.1964 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా 16 సినిమాలలో నటించారు.

సీనియర్ ఎన్టీఆర్ నటించిన అగ్గిపిడుగు సినిమాతో ఓపెనింగ్ కలెక్షన్లను ప్రకటించే సాంప్రదాయం టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైంది.1963లో విడుదలైన లవకుశ తెలుగులో తొలి పూర్తి రంగుల చిత్రం కావడం గమనార్హం.ఈ సినిమా నుంచి పత్రికలలో సినిమాల కలెక్షన్లను ప్రచురించడం మొదలైంది.1950 సంవత్సరంలో రిలీజైన మాయా రంభ ఎన్టీఆర్ నటించిన తొలి పౌరాణిక చిత్రం కావడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube