వాట్సాప్ అలెర్ట్: ఇలాంటి తప్పులు చేయకండి, ఒక్క కాల్‌తో మీ వాట్సాప్‌ హ్యాక్ అయిపోగలదు!

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్‌ వుండదంటే నమ్మశక్యం కాదేమో.కానీ ఇది నిజం.

 Whatsapp Alert: Do Not Make Such Mistakes, Your Whatsapp Can Be Hacked With A S-TeluguStop.com

తాజా సర్వే ప్రకారం ప్రతి స్మార్ ఫోన్ లో వాట్సాప్ అనే యాప్ ఉంటుంది.అదే అదనుగా తీసుకోని సైబర్ నేరగాళ్లు ప్రజలను ట్రాప్ చేయడానికి ఈ మార్గం అనుసరిస్తిన్నారు.

ప్రస్తుతం వాట్సాప్‌కు ఉన్న ఆదరణ నేపథ్యంలో మోసాలు కొత్త స్కామ్‌ను ప్రారంభించాయి.నివేదికల ప్రకారం, సైబర్ ప్రపంచంలో కొత్త వాట్సాప్ మోసం జరుగుతోంది.

దీని సహాయంతో హ్యాకర్లు మీ వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసే వీలుంది.తాజాగా క్లౌడ్‌సెక్‌.

కామ్‌ CEO రాహుల్‌ శశి ఈ విషయాన్ని వెల్లడించారు.వాట్సాప్ యూజర్ల ఖాతాను హ్యాక్ చేసేందుకు కొత్త OTP మోసం జరుగుతోందని రాహుల్ చెప్పుకొచ్చారు.

రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం, సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేయడానికి ఒక సాధారణ ట్రిక్ ఉపయోగిస్తున్నారు.హ్యాకర్లు వివిధ వ్యక్తులకు ఫోన్ చేసి 67 లేదా 405డయల్ చేయమని అడుగుతారు.

ఇక వినియోగదారు ఈ నంబర్‌లను డయల్ చేసిన వెంటనే, అతడి WhatsApp ఖాతా ఆటోమెటిక్‌గా లాగ్ అవుట్ అవుంతుంది.దీంతో హ్యాకర్లు దానిపై పూర్తి నియంత్రణను పొందుతారు.

నంబర్‌ని డయల్ చేయడం ద్వారా హ్యాకర్‌లు ఎలా నియంత్రణ పొందుతారు అనే డౌట్ మీకు రావచ్చు.అదెలా అంటే…

Telugu Cyber, Cyber Security, Whatsapp-Latest News - Telugu

వాస్తవానికి వినియోగదారులు డయల్ చేస్తున్న నంబర్ జియో, ఎయిర్‌టెల్ సేవలకు సంబంధించినదని శశి పేర్కొన్నారు.ఇది కాల్ ఫార్వార్డింగ్ కోసం ఉపయోగించేందుకు వాడే నంబర్.ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా నంబర్‌కు ఫార్వార్డ్ చేసే ఈ ట్రిక్‌లో హ్యాకర్లు వినియోగదారులను ట్రాప్ చేస్తున్నారు.

మరోవైపు, హ్యాకర్లు WhatsApp రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.ఫోన్ కాల్ ద్వారా OTP ఎంపికను ఎంచుకుంటారు.

ఆ సమయంలో వినియోగదారుల ఫోన్ బిజీగా ఉన్నందున, హ్యాకర్ నంబర్‌కు (కాల్ ద్వారా) OTP వస్తుంది.తద్వారా వారు మీ ఖాతాను యాక్సెస్ చేసేందుకు అనుమతి పొందనున్నారు.అందుకే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండమని క్లౌడ్‌సెక్‌.కామ్‌ CEO రాహుల్‌ శశి అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube