కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దని కోరారు.
దేశ రక్షణ రంగంలో మెదక్ ఆర్డినెన్స్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.దేశ భద్రతను దృష్టిలో ఉంచుకోవాలన్న మంత్రి హరీశ్ రావు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందని హెచ్చరించారు.
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎలాంటి సవాళ్లను అయినా స్వీకరిస్తుందన్నారు.ఈ క్రమంలో ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలని లేఖలో కోరారు.
ఈ నేపథ్యంలో డిఫెన్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు లేఖలో విన్నవించారు.







