కొడుకు కోసం పూరీ ఏం చేస్తున్నాడంటే..?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్‌తో బొంబాట్ హిట్ కొట్టాడు.రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో పూరీ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సక్సెస్‌ను అందుకున్నాడు.

 Puri Jagannadh Turns Lyricist For Romantic Movie-TeluguStop.com

కాగా పూరి తన కొడుకును హీరోగా పెట్టి రొమాంటిక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో ఆకాష్ పూరికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్.

కాగా ఈ సినిమా కోసం పూరి తనలోని మల్టీ టాలెంట్‌ను బయటకు తెస్తున్నాడు.రొమాంటిక్ చిత్రం షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు పూరీ డైరెక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.ఇక ఈ సినిమాలోని ఓ పాటకు పూరీ లిరిక్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది.

నువ్వు నేను ఈ క్షణం అంటూ సాగే ఈ పాటను పూరీ స్వయంగా రాసినట్లు మరో నిర్మాత చార్మి తెలిపింది.కాగా శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు చార్మి తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపింది.

మరి పూరి రాసిన ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.ఇక రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube