మన దేశంలో క్రికెట్ అంటే ముఖ్యంగా ఐపీఎల్ అంటే ఇక అభిమానులకు పండగే.ముఖ్యంగా సీఎస్కే అంటే ఐపీఎల్ లోనే ఫేవరెట్ గా నిలుస్తూ ధోనీ నాయకత్వంలో ఆడుతున్న సీఎస్కే టీం ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుండే విన్నర్ గా , రన్నరప్ గా నిలుస్తూ ఐపీఎల్ లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న జట్టుగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే గత సీజన్ లో అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేదు.అప్పుడు ధోనీ నాయకత్వంపై కూడా విమర్శలు వచ్చాయి.

కాని ఐపీఎల్ ముగిసిన తర్వాత జట్టు ఇంత ఘోర ప్రదర్శనకు దారి తీసిన కారణాలను చర్చించి కొంత మంది ఆటగాళ్లకు ఉద్వాసన పలకాలని సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.అయితే ఐపీఎల్ 2021 మినీవేలం కోసం ఈ నెల 21 లోగా తాము తొలగించాలనుకునే ప్లేయర్ల జాబితాలను పంపాలని బీసీసీఐ ఫ్రాంచైజీ లకు సూచించింది.అయితే సీఎస్కే వదులుకున్న ఆటగాళ్లు ఎవరనే ఆసక్తి అభిమానులలో మొదలైంది.అనధికారిక సమాచారం మేరకు కేదార్ జాదవ్- 7.8 కోట్లు, డ్వేన్ బ్రావో-6.4 కోట్లు,కరణ్ శర్మ- 5 కోట్లు, పీయుష్ చావ్లా- 6.75 కోట్లు, మురళి విజయ్- 2 కోట్లు, హర్భజన్ సింగ్- 2 కోట్లు,జోష్ హేజిల్ వుడ్- 2 కోట్లు, ఇమ్రాన్ తాహిర్- కోటి.అయితే ఇక మరి వీరి స్థానంలో సీఎస్కే యాజమాన్యం ఎవరిని భర్తీ చేస్తారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







