1.ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉచిత శిక్షణ
సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ( సీఈడియం ) ఆధ్వర్యంలో టిఎస్ టెట్ 2022 పరీక్షకు హాజరయ్యే ఉర్దూ మీడియం అభ్యర్థులకు నిజాం కాలేజీలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ అహ్మద్ జలీల్ తెలిపాటు.
2. హైదరాబాద్ కు ప్రధాని మోదీ
ఈనెల 26 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు.గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రారంభమై 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 26 దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు.
3.బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా తెలంగాణ
గౌతమ బుద్ధుడు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ బుద్ధుడి బోధనలను స్మరించుకున్నారు.తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.
4.తీర్పులు మార్పులు పుస్తకావిష్కరణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వెలువరించిన కీలక తీర్పులు న్యాయవ్యవస్థలో చేపట్టిన సంస్కరణలను అక్షర రూపంలో తీసుకువచ్చారు.” తీర్పులు మార్పులు ” పేరిట ఈ పుస్తకాన్ని సోమవారం వెలువరించినట్టు రచయిత , ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడు తెలిపారు .
5.కృష్ణా బోర్డు తీరు అభ్యంతరకరం
కృష్ణా నది యాజమాన్య బోర్డు తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.కేసీ కెనాల్ కు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం లేదని ఏపీ అభ్యంతరాలను తీసుకుని అధ్యయనానికి సిఫార్సు చేయడం పై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది.
6.గ్రూప్ వన్ కు 1,23,200 దరఖాస్తులు
గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి.సోమవారం నాటికి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 1,23,200 కి చేరింది.
7.ఏపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఆగ్రహం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై వైసిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
8.రైతులకు భరోసా కల్పించడంలో జగన్ విఫలమయ్యారు : బీజేపీ
రైతులకు భరోసా కల్పించడంలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారని బిజెపి నాయకుడు లంకా దినకర్ విమర్శించారు.
9.ద్వారకా తిరుమలలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు
ద్వారకా తిరుమల లోని వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఏడో రోజు ఘనంగా జరుగుతున్నాయి.
10.టిడిపి రాష్ట్ర కార్యదర్శి కి బెదిరింపులు
టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు.కమలాపురంలో ఆయన కారును ధ్వంసం చేశారు.
11.రేపు కడప జిల్లాకు చంద్రబాబు రాక
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
12.ఆర్ ఆర్ సీ ఏ టీ లో పోస్టుల భర్తీ
ఇండోర్లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లో వివిధ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
13.ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
ఏపీ లోని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈనాడు స్టేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
14.బిఎస్ఎఫ్ లో పోస్టుల భర్తీ
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్-బి పోస్టులు భర్తీ చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
15.చిదంబరం కుమారుడి పై కేసు నమోదు
మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది.
16.సిమెంట్ రంగంలోకి ఆదానీ గ్రూప్
దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీలు అంబుజా, ACC సిమెంట్స్ ను గౌతమ్ ఆదాని నేతృత్వంలోని ఆదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.ఈ డీల్ విలువ 81 వేల కోట్లు.
17.వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు నలుగురిని జగన్ ఖరారు చేశారు.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి పేర్లను దాదాపు ఫైనల్ చేశారు.
18.కమలహాసన్ సంచలన కామెంట్స్
మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ పేర్కొన్నారు.
19.తీన్మార్ మల్లన్న పై పరువు నష్టం దావా
క్యూ న్యూస్ మీడియా అధినేత తీన్మార్ మల్లన్న పై పది కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్ పరువు నష్టం దావా వేశారు.
20.కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్
సీఎం కేసీఆర్ 16 రోజులు ఫామ్ హౌస్ లో సేదతీరి వచ్చాడని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.