శుక్రవారం గోరింటాకు పెట్టుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవా... సీతమ్మ వరమే కారణమా?

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందంగా ఉండటమే కాకుండా గోరింటాకు ఎర్రగా పండితే వారు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని భావిస్తుంటారు.ఇక ఏ చిన్న ఫంక్షన్ జరిగిన తప్పనిసరిగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చేతినిండా గోరింటాకు పెట్టుకుంటారు.

 There-is No Difficulties In Life When You Put Gorintaku On Friday Because Of See-TeluguStop.com

ఇక పురాణాల ప్రకారం గోరింటాకు ఇంత ప్రాధాన్యత సీతమ్మ వల్లే వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

సీతాదేవి అరణ్యవాసం చేసిన తర్వాత రావణాసురుడు ఆమెను అపహరించి అశోకవనంలో బంధించిన సంగతి మనకు తెలిసిందే.

అశోకవనంలో ఒంటరిగా కూర్చున్న సీతాదేవి తన కష్టాల అన్నింటినీ కూడా అశోక వనంలో ఉన్న గోరింటాకు చెట్టుకు చెప్పు కుందని పురాణాలు చెబుతున్నాయి.అయితే రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీరాముడితో పాటు సీతాదేవి అయోధ్య తిరిగి వెళ్తున్న సమయంలో తన కష్టాల అన్నింటిని గోరింటాకు విన్నది కనుక గోరింటాకు చెట్టుకు ఏదైనా వరం ఇవ్వాలని భావించింది.

Telugu Devotional, Friday, Gorintaku-Latest News - Telugu

ఈ క్రమంలోనే గోరింటాకు చెట్టు ఏదైనా వరం కోరుకొమ్మని సీతాదేవి అడగగా గోరింటాకు చెట్టు తనకు ఎలాంటి వరం వద్దని ప్రస్తుతం నీ మొహంలో ఎలా సంతోషం ఉందో లోకంలోని మహిళలందరూ కూడా అలాగే ఉండాలని కోరుకోవడంతో గోరింటాకు చెట్టు నిజాయితీకి సంతోషించిన సీతాదేవి గోరింటాకు వరం ఇచ్చింది.ఏ మహిళ అయితే గోరింటాకు చెట్టును పూజించి గోరింటాకును పెట్టుకుంటారో అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయని వారికి ఎలాంటి కష్టాలు ఉండవని వరమిచ్చారు.ఇక శుక్రవారం పూట మహాలక్ష్మికి ఎంతో ఇష్టం కనుక ఆ రోజు కనుక గోరింటాకు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube